Home

»

Tv News

Karthika Deepam2 : రోడ్డున పడ్డ శివన్నారాయణ ఫ్యామిలీ.. కార్తీక్ ఆదుకుంటాడా!

Sep 18, 2026 9:35AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్  781 లో....శివన్నారాయణ గర్వం బద్దలైంది. నన్ను మించిన పోటుగాడు లేడంటూ విర్రవీగి నిజం తెలుసుకోకుండా దీప, కార్తీక్ లను ఇంటి నుంచి, ఆఫీస్ నుంచి వెళ్లగొట్టాడు. చివరికి మాలిని అతని ఆస్తులన్నీ లాగేసుకోవడంతో ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడింది. అటు యాక్సిడెంట్ అయిన దీప తన ప్రాణాలతో పాటు కడుపులో బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. దీప చచ్చిందో బతికిందో తెలియలేదని మాలిని ఆలోచిస్తుండగానే సూరజ్ రక్తపు మరకలతో ఇంటికి వస్తాడు. ఈ రక్తం నాది కాదమ్మా, నేను కాపాడిన దీప వదినది.. దారిలో యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి తీసుకెళ్లి కాపాడానని చెప్పడంతో మాలిని షాక్ అవుతుంది. ఎవడో కారు గుద్దేసి వెళ్లిపోయాడట, యాక్సిడెంట్ జరిగేటప్పుడు జ్యోత్స్న అక్కడే ఉందని సూరజ్ చెప్పగా నేను తీయాలనుకున్న ప్రాణాలు నువ్వు పోశావా అని మాలిని మనసులో అనుకుంటుంది. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి సూరజ్ ని కొత్త బ్రాంచ్ కి పంపిస్తుంది.

 

ఇటు హాస్పిటల్ బెడ్ పై కళ్లు తెరిచిన దీప..‌నా ప్రాణాలు కాపాడింది జ్యోత్స్ననా అని అడగ్గా అవును దీపా, జ్యోత్స్న, సూరజ్ లు నీ ప్రాణాలు కాపాడారని కార్తీక్ చెప్తాడు. తాత ఇంటికి వెళ్లావా.. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందట. ఆ విషయం చెప్దానని వస్తుంటేనే నాకు యాక్సిడెంట్ అయ్యిందని దీప చెప్తుంది. కార్తీక్ కంగారుగా శివన్నారాయణ ఇంటికి వెళ్తే గేటుకు తాళం వేసి ఉంటుంది. మేనేజర్ వచ్చి.. శివన్నారాయణ ఆస్తులన్నీ మాలిని మేడమ్ జప్తు చేసుకున్నారు.. కట్టుబట్టలతో బయటకు గెంటేశారని చెప్పడంతో కార్తీక్ కుప్పకూలిపోతాడు. అదే టైంలో జ్యోత్స్న ఫోన్ సూరజ్ కారులో మర్చిపోవడంతో వేరే నంబర్ నుంచి కాల్ చేస్తుంది. ఆస్తులన్నీ లాగేసుకొని రోడ్డుపైకి నెట్టి రెండు రోజులైంది..‌దొంగ సంతకం చేయించుకొని మా కుటుంబాన్ని రోడ్డున పడేశావ్.. ఆ ఫోన్ నువ్వే ఉంచుకోమంటూ సూరజ్ మీద జ్యోత్స్న ఫైర్ అవుతుంది.

 

ఇక దీప డిశ్చార్జ్ అయి ఇంటికి రాగానే కాంచన..‌నా కుటుంబం ఏమైపోయిందో, ఎక్కడున్నారోనని ఏడుస్తుండటం వింటుంది. మీ కుటుంబం రోడ్డున పడటం ఏంటని దీప అడగ్గా దొంగ సంతకాలు పెట్టించుకొని మాలిని మొత్తం లాగేసుకుందని కార్తీక్ చెప్తాడు. వెంటనే దీప, కార్తీక్ లు బైక్ ఎక్కి ఊరంతా వెతుకుతుంటే సూరజ్ చెప్పించిన ఒక వ్యక్తి.. మీ ఫ్యామిలీ మణికొండ బస్టాప్ దగ్గర ఉందని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అక్కడికి వెళ్లేసరికి శివన్నారాయణ ఫ్యామిలీ రోడ్డుపైనే ఉంటుందిమ. తాతా ఇదేంటి.. మీ కూతురి ఇంటి కంటే ఈ రోడ్డే నయం అనుకున్నావా.. మేమంతా లేమనుకున్నావా అని కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు శివన్నారాయణ..‌నువ్వొక్కడివి వచ్చి మంచి పని చేశావ్ రా.‌.‌ నీ భార్య చేసిన పనికి మాకు ఎలాంటి కర్మ పట్టిందో తెలిసేది కాదు.. సూరజ్ ని ఆఫీస్ లోకి తీసుకొచ్చి నా పతనానికి శంకుస్థాపన చేసిందంటూ దీపని తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Karthika Deepam 2, Karthika Deepam 2 Episode 781, Star Maa Serial, Deepa, Karthik, Jyotsna, Suraj, Shivannarayana, Malini, Kanchana, Karthik Deepa, Telugu Serial]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com