
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు illu illalu pillalu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 582 లో.....సేనాపతి ప్రేమని పక్కకు పిలిచి.. ఈరోజు మన వంశం వాళ్లు వస్తున్నారు. మీ అన్నయ్య పెళ్లి గురించి మాట్లాడటానికి.. నువ్వు మన ఇంటికి వచ్చావని ధీరజ్ కోపంగా ఉన్నాడు.వచ్చిన వాళ్లతో గొడవ పెడతాడని భయంగా ఉంది, మన పరువు తీస్తాడేమోనని అంటాడు. ధీరజ్ అలా ఎప్పటికీ చేయడు నాన్నా అని ప్రేమ హామీ ఇస్తుంది. మరోవైపు నర్మదకు స్మిత షాకింగ్ ఎవిడెన్స్ చూపిస్తుంది . ప్రేమ, ధీరజ్ మోపిదేవి వెళ్లిన రోజే వల్లి వాళ్ల అమ్మానాన్నలు కూడా అక్కడికే వెళ్లారు.వాళ్లకు ఫోన్ చేసింది ఒరిజినల్ ఎస్సై కాదు ఫేక్ పర్సన్, వల్లి ఫోన్ నుంచి భద్రావతికి కాల్ వెళ్లలేదు కానీ మీ ఇంటి చుట్టుపక్కల నుంచి ఒక అన్ నోన్ నంబర్ నుంచి చాలా కాల్స్ వెళ్లాయని చెప్పడంతో నర్మదకు అదంతా భద్రావతి ప్లాన్ అని అర్థమవుతుంది. అటు వల్లి మాత్రం.. ఇది భద్రావతితో మాట్లాడే సీక్రెట్ సిమ్.. దొరికితే నాకు సావే అంటూ దాచిపెడుతుంది.
భద్రావతి బయట నిలబడి తన మనుషులకు.. ఏం చేయాలో గుర్తుంది కదా.. ధీరజ్ రాగానే మొదలు పెట్టండి. వాడి రక్తం మరిగిపోవాలని ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. సేనాపతి.. ప్రేమను ఎలా దూరం చేస్తావని అడిగితే..కాసేపట్లో చూస్తావని అంటుంది. బంధువులు ఇంటికి రాగానే భద్రావతి ప్లాన్ ప్రకారం బయట ముగ్గురు.. అమ్మాయి అందంగా ఉంది కదా, భార్యగా దొరకడం వాడి అదృష్టమని మాట్లాడుకుంటుండగా ధీరజ్ కారు దిగి వచ్చి.. ఏమైందని అడగ్గా.. ప్రేమకు పెళ్లి చూపులని చెప్పడంతో ధీరజ్ షాక్ అయి కోపంతో ఊగిపోతాడు.
కోపంగా ఇంట్లోకి వెళ్లి ప్రేమ అని గట్టిగా అరిచి చేతిలో ఉన్న ప్లేట్ విసిరికొట్టి రచ్చ చేస్తాడు. కూల్ డ్రింక్ ఇవ్వడానికి సిగ్గు లేదా, ఎవరిని చేసుకుంటావే అంటూ ప్రేమను లాగిపెట్టి కొడతాడు. నా కూతురినే కొడతావా అని సేనాపతి కాలర్ పట్టుకోగానే.. నిన్ను కొట్టలేదని ఫీలవుతున్నావా అంటూ సేనాపతిని కూడా కొడతాడు. బంధువులు..పట్టపగలే తాగి వచ్చాడా, ఇలాంటి వాడికి ప్రేమనిచ్చి పెళ్లి చేశారా అని అనుకుంటుండగా భద్రావతి.. దండం పెడతా వెళ్లరా అంటూ నాటకం స్టార్ట్ చేస్తుంది. భద్రావతి మీదకు కూడా చేయి ఎత్తడంతో అందరు భయపడుతారు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu, Illu Illalu Pillalu Episode 582, Star Maa Serial, Dheeraj, Prema, Bhadravathi, Senapathi, Narmada, Smita, Telugu Serial]






