Home

»

Tv News

Podharillu : నిజం చెప్పేసిన చక్రి.. మాధవ ఎంగేజ్మెంట్ జరుగుతుందా!

Sep 16, 2026 9:47AM

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  210 లో.....మాధవ ఎంగేజ్మెంట్ ఆపేందుకు నారాయణ, కేశవ, కన్నా కలిసి పంతులుకి ట్రిపుల్ ఎమౌంట్ ఇస్తామని అడ్వాన్స్ ఇచ్చి జాతకాలు బాలేవని అబద్ధం చెప్పమంటారు. పంతులు.. మార్కండేయుడు మాట ఇస్తే అయినట్టే అని చెప్పడంతో వాళ్లు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని సంబరపడతారు. ఇంతలో శేఖర్ వచ్చి నారాయణని.. బాబాయ్ మందు తాగుదామా అని అంటే నా భార్యని నీ కొడుకు చేసుకుంటే బాబాయ్ అవుతావ్ కదా అనడంతో నారాయణ ఫైర్ అవుతాడు. తర్వాత నారాయణకి ఐడియా వచ్చి పెగ్గు వేసి రచ్చ చేసి ఎంగేజ్మెంట్ ఆపుదామని అనుకుంటాడు. మహా.. తాగినట్టు నటించు అన్నా వినకుండా నిజంగానే తాగి వచ్చాడు.

 

నారాయణ.. రేయ్ శిశుపాలుడా, వంద తప్పులు చేసినోడా, ప్లాస్టిక్ పూలా, నా కొడుకు పెళ్లి మీకు చీప్ గా ఉందా, మర్యాద లేదు, మందు లేదు, ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అంటూ గట్టిగా అరిచి రచ్చ చేస్తాడు. ఇదంతా చాటుగా చూస్తున్న కేశవ, కన్నా, మహా.. మన ప్లాన్ సక్సెస్ అవుతుందని సంబరపడతారు. కానీ శశిపాల్ తెలివిగా నారాయణని లోపలికి తీసుకెళ్లి రూంలో మందు ఫ్యాక్టరీనే చూపించి.. కావాల్సినంత తాగండి అనడంతో నారాయణ కూల్ అయిపోతాడు. మందు అడిగితే ఫ్యాక్టరీ చూపించాడు, ప్లాన్ పోయిందని వచ్చి మహా వాళ్లకు చెప్పడంతో అందరు డల్ అవుతారు. పెద్ది వచ్చి ఏం చేస్తున్నారని అడగడంతో తప్పించుకుంటారు.

 

ఇక పంతులు జాతకాలు చూసి..‌ మొదటి పెళ్లికి సరిగ్గా చూడలేదు.. ఇప్పుడైనా చూడనివ్వండి, జాతకాలు దివ్యంగా ఉన్నాయి.. తరతరాలు వర్ధిల్లుతారని చెప్పడంతో కేశవ, కన్నా షాక్ అవుతారు. పంతులు..‌అబద్ధం చెప్పలేను బాబు అని తప్పించుకుంటాడు. మరోవైపు నా భార్యకి మళ్లీ పెళ్లి అని శేఖర్ బాధపడి వెళ్లిపోతాడు. చివరకు పెద్ది అందరినీ పిలిచి నిలదీయగా చక్రి.. అవును నేనే రెచ్చగొడుతున్నా, ఈ పెళ్లి ఆపుతామని అనుకున్నట్టయ చెప్తాడు. దానికి పెద్ది.. నా ఇంట్లోనే నాకు శత్రువులున్నారు.. దయచేసి ఆపొద్దని పెద్ది అందరిని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com