Home

»

Tv News

Illu Illalu Pillalu : ప్రేమ, ధీరజ్ లను విడదీసిన భద్రావతి... నర్మద ఏం చేయనుంది!

Sep 16, 2026 9:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 580 లో....వేదవతి, ధీరజ్, నర్మద, చందు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రామరాజు వస్తాడు.‌ఇక అది గమనించిన శ్రీవల్లి.. రహస్య మీటింగ్స్.. అంటూ అడ్డంగా ఇరికించడంతో వేదవతిపై రామరాజు కోప్పడుతాడు. రేయ్ ముందు నీ సంసారాన్ని చక్కదిద్దుకోరా, తర్వాత మిగతా వాళ్ల జీవితాలు ఉద్దరిద్దువని ధీరజ్ కి గడ్డిపెట్టి వెళ్లిపోతాడు. దానికి వేదవతి కూడా..‌నువ్వు తప్పు చేయడమే కాకుండా పాపం ప్రేమను కూడా ఇరికించావు.. అక్కడ దాని పరిస్థితి ఏంటోనని ధీరజ్ ని అంటుంది. మరోవైపు పుట్టింట్లో ఉన్న ప్రేమ చెంపపై లాగిపెట్టి కొడుతుంది భద్రావతి. చిన్న కూతురు కళ్లెదుటే ఉన్నా పుట్టింటికి వచ్చే అదృష్టం లేదని 25 ఏళ్లుగా కుమిలిపోతున్నా.. ఇప్పుడు చిన్న కొడుకుని కూడా ఇంట్లో నుంచి గెంటేశారని శారాదాంబ ఏడుస్తుంటుంది.  విశ్వ, రేవతి ఓదార్చారు.. కానీ భద్రావతి.. ప్రేమ నువ్వు మా నాశనాన్ని కోరుకుంటున్నావా అంటూ గట్టిగా అరుస్తుంది. ఆరోజు ధీరజ్ తో కలిసి పెళ్లి వాళ్ల ఇంటికి సంబంధం చెడగొట్టడానికి వెళ్లింది నువ్వేనా.. మేమంటే అంత కోపం ఎందుకు.. ఇన్నాళ్లు పెంచిన మాకంటే వాడే ముఖ్యమైనప్పుడు ఇక్కడ ఉండి మా పరువు తీయడం ఎందుకని నిలదీస్తుంది. ఇందాక ధీరజ్ గాడి అంతు చూసేవాడిని, నీ కూతురే పెళ్లి చేసింది అనేసరికి వెధవనైపోయా‌నని సేనాపతి విసుక్కుంటాడు.

 

సారీ అత్తా, బాబాయ్ ప్రేమించానని చెప్తే అలా చేయాల్సి వచ్చిందని ప్రేమ చెప్తుంది. అయినా భద్రావతి వినదు. ఆ విషయం మాకు చెప్పావా, వాళ్లతో కలిసి వెళ్లి దగ్గరుండి పెళ్లి జరిపించావు.. వాడి దగ్గరికే వెళ్లిపోవచ్చు కదా అంటూ.. నువ్వు ఇచ్చిన అలుసుతోనే వాడు మమ్మల్ని అవమానించాడని సేనాపతి అంటే భద్రావతి.. ఆరోజు నువ్వు కళ్యాణ్ గాడితో వెళ్లిపోయావని అందరి ముందు అనలేదా, ఈరోజు గుడిలో నిశ్చితార్థం ఆగిపోవడంతో ఊరందరి ముందు పరువుపోయింది.‌ ఇందాక నిన్ను అడ్డుపెట్టుకుని నోరు మూసుకుని రావాల్సి వచ్చింది. మరోసారి నిన్ను అడ్డుపెట్టుకుని పరువు తీస్తాడని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి.. వాడు మా పరువు తీస్తే చచ్చిపోతామంటూ తాగి చచ్చిపోతామని డ్రామా చేస్తుంది. ధీరజ్ అలా చేయడని నాది హామీ అని ప్రేమ అంటుంది. ఒకవేళ చేస్తే ఏం చేస్తావ్, చెప్పమని భద్రావతి గట్టిగా నిలదీయడంతో ప్రేమ.. ధీరజ్ మరోసారి మన కుటుంబం పరువు తీసేలా ప్రవర్తించినా, నన్ను గానీ మిమ్మల్ని అవమానించినా నేను ఈ జన్మలో వాడి జీవితంలోకి వెళ్లను, మాటిస్తున్నా అత్తా అంటూ చేతిలో చేయి వేసి ఒట్టు పెట్టేస్తుంది. ఇదే భద్రావతి కావాలనుకున్నది.

 

మరోవైపు భాగ్యం, ఇడ్లీలను చింతామణి పొట్టు పొట్టు కొడుతూ.. నా కూతురు ఎంగేజ్మెంట్ ఆపుతారా.. పెళ్లి కొడుకుని తీసుకెళ్లి మీ మేనకోడలితో పెళ్లి చేస్తారా అని కొడుతుంటే భాగ్యం.. మాకు ఆ విషయం తెలీదు, వాళ్లు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, మేము చేసి ఉంటే ఇంటికి వచ్చేసేవాళ్లు కదా అని అంటుండగానే తిరుపతి, సుకన్య ఎంట్రీ ఇవ్వడంతో చింతామణి భాగ్యం, ఇడ్లీ చెంపలు వాయించి వెళ్లిపోతుంది. భాగ్యం హారతి ఇచ్చి వాళ్లను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. రాత్రి ఇంటి బయట ప్రేమ, ధీరజ్ ఎదురెదురుగా కూర్చుంటే చుట్టూ అమూల్య, విశ్వా, నర్మద, సాగర్ ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడమని నర్మద అంటే.. వీడితో వెళ్తే నా చెంప ఎలా పగిలిందో చూశావ్ కదా అని ప్రేమ అంటుంది. తోక ఊపుకుంటూ వచ్చావని ధీరజ్ అనడంతో మళ్లీ గొడవ మొదలైంది.. సంసారం అంటే అన్ని ఎమోషన్స్ ఉండాలి, ఇగో దగ్గరే ఆగిపోకూడదు, మామయ్య కూడా నిన్ను ఇంటికి రమ్మన్నారు.. చేయి కలుపుకోండి  అని నర్మద చెప్పడంతో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. వెంటనే ధీరజ్ శానిటైజర్ తో చేతులు క్లీన్ చేసుకోవడంతో.. నువ్వొక పందివి అంటూ ప్రేమ మళ్లీ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com