Home

»

Tv News

Jayam serial: రుద్ర ఎమోషనల్.. విశ్వకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న జయ!

Sep 13, 2026 12:36PM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-372 లో.‌. వీరుని తీసుకురావడానికి రుద్ర పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ అతను రానని చెప్పడంతో రుద్ర తిరిగి హాస్పిటల్ కి వచ్చేస్తాడు.‌ ఇక ప్రీతిని చూడటానికి లోపలికి వెళ్తాడు రుద్ర. ఒకవేళ నాకు ఏం అయినా అయితే నా భర్తని , నాకు పుట్టబోయే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఎమోషనల్ అవుతున్న ప్రీతీని‌ ఓదార్చలేకపోతాడు. 

ఇక రుద్ర లోపల మాట్లాడుతుంటే ఇక్కడ బయట శకుంతలని ఇషిక మ్యానిపులేట్ చేస్తుంది. ‌ఎలాగైనా రుద్ర బావని మీరే ఆపాలని ఇషిక అంటుంది. ‌ఆల్రెడీ వీరు మీద కేసు ఫైల్ అయిందని‌ శకుంతల అంటుంది. ‌అయింది కానీ రుద్ర బావకి డౌట్ వచ్చిందంటే మొత్తం అన్నీ బయటకి లాగుతాడు.‌.‌సో మనం ఆవేశంగా కాకుండా ఆలోచించాలని ఇషిక అంటుంది. ఏం అంటున్నావని శకుంతల అంటుంది. అవును అత్తయ్య..‌గంగ తాగిన పాలల్లో ఎవరో స్లీపింగ్ పిల్స్ కలిపారని‌ డౌట్ వచ్చి సాక్ష్యం కోసం ఆగారు రుద్ర బావ. అలాగే ఇప్పుడు వీరు గురించి ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అంటే అన్నీ బయటకొస్తాయని ఇషిక అంటుంది. అలా కాకూడదంటే మీతోనే సాధ్యమవుతుంది. రుద్ర బావకి మీ మాటే వేదం.. మీ ప్రేమ కోసం.. మిమ్మల్ని పెద్దమ్మ అని పిలుస్తూ.. రుద్ర అనే పిలుపు కోసం ఎంతగానో పరితపిస్తుంటాడు. ఆ అమ్మ సెంటిమెంట్ ని మీరు వాడుకోవాలి.‌ ప్రేమతో రుద్ర బావ మనసుని మార్చేయాలి.. ఆ గంగ బాక్సింగ్ గెలవకుండా చూడాలి.. దాంతో అతని మనసు విరిగిపోతుందని ఇషిక చెప్పగానే సరే అన్నట్టుగా శకుంతల ఎక్సపెషన్ ఇస్తుంది.

మరోవైపు విశ్వ ఢిల్లీ నుండి ఇంటికి వస్తాడు. అదే సమయంలో జయ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే కార్ లో నుండి విశ్వ దిగి వస్తాడు. జయ బాక్సింగ్ ప్రాక్టీసు చేయడం చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత జయ, విశ్వ ఇంట్లోకి వెళ్ళాక సుధా అడుగుతుంది. మీరు వెళ్ళిన పని ఏమైందని అడుగుతుంది. అంతా బానే జరిగింది కానీ గంగ స్పాన్సర్‌ షిప్ క్యాన్సిల్ గురించి  అడిగారు. తలదించుకున్నానని విశ్వ అంటాడు. మీరేం బాధపడకండి నాన్నగారు.. మీ గౌరవం నేను నిలబెడతాను. బాక్సింగ్ లో‌  గెలిచి ఆ గంగ పోగొట్టిన గౌరవాన్ని మీకు తిరిగి తీసుకొస్తానని జయ అంటుంది. అదంతా నిజమనుకొని సుధా,విశ్వ మురిసిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Jayam Serial Episode 372 Telugu Recap, Jayam Zee Telugu Serial Today Episode, Jayam Serial Latest Written Update, Jayam Serial Story 372, Zee Telugu Jayam Serial Episodes]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com