స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -202 లో...నాకు ఇది రెండో పెళ్లి.. విడాకులు ఇంకా అవ్వలేదని మీ అన్నయ్య మీకు చెప్పలేదా అని జయంతి అంటుంది. అబ్బాయి పనేంటి, ఎంత సంపాదిస్తాడని జయంతి తండ్రి అడుగుతుంది..ఇన్ని మాట్లాడుకుని ఆ విషయం మాట్లాడుకోలేదా అంటూ నారాయణ కౌంటర్ వేసి వెళ్లిపోతాడు. తన వాళ్లకు తను సర్ది చెప్పుకుంటానని మాధవ అంటాడు. పర్లేదు ఆలోచించుకోండి.. నాకు ఇంకా రెండు మూడు సంబంధాలు క్యూలో ఉన్నాయి.. అందరికీ ఓకే అయితేనే ముందుకు వెళ్దామని జయంతి కండిషన్ పెడుతుంది. వచ్చే శుక్రవారం ముహూర్తం బాగుందని బ్రోకర్ అనగానే కేశవ, చక్రి వద్దన్నట్టుగా రియాక్ట్ అవుతారు. ఈ ఇంటి దుమ్ముని ఇక్కడే కడిగేసుకుని వెళ్లండి అంటూ చక్రి కౌంటర్లు వేస్తాడు.
సంబంధం వాళ్లు వెళ్లిపోయాక ఇంట్లో పెద్ద గొడవ మొదలవుతుంది. సాగనంపేందుకు ఎవరు రాకపోవడంతో పెద్ది ఒక్కడే కార్ వరకు వెళ్లి వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావ్.. సమాధానం చెప్పాల్సి వస్తుందని తప్పించుకుంటున్నావా అంటూ కేశవ, చక్రి, కన్నా, మహా ప్రశ్నల వర్షం కురిపిస్తారు. బయట నుంచి ఇదంతా నారాయణ వింటూ ఉంటాడు. నా పెళ్లి నా ఇష్టం అని పెద్ది కఠినంగా అనడంతో అందరు షాక్ అవుతారు. లోపలికి వచ్చిన నారాయణ.. ఇలాంటి వాడికా గుడి కడతానన్నావ్, నా నాన్న, నా తమ్ముళ్లు, నా ఇల్లు అన్నవాడు ఇంత స్వార్థంగా మారిపోయాడా అంటూ నారాయణ ఫైర్ అవుతాడు.
నా గురించి నేను ఆలోచించుకోవడం తప్పా.. ఇన్నాళ్లకు నా గురించి నేను నిర్ణయం తీసుకుంటే కడుపు మంటనా అంటూ పెద్ది మరింత కఠినంగా మాట్లాడతాడు. ఈ అమ్మాయి మన ప్రాపర్టీ కోసమే వస్తోంది, పొగరు, అహంకారం ఉంది.. మన గాయత్రి ఎక్కడ, ఈమె ఎక్కడ.. ఈ కుటుంబాన్ని విడగొడుతుందని మహా అంటుంది. మీ సుఖం కోసం మేము ఈ ఇంటి నుంచి వెళ్లిపోతామని చక్రి అనగా..మంచి సంబంధం దొరకడం లేదు.. కొందరికి ఇల్లు నచ్చడం లేదు.. నా వల్ల కేశవ, శైలు ఇబ్బంది పడటం నాకు నచ్చడం లేదు.. అందుకే రెండో పెళ్లి అయినా జయంతిని చేసుకోవాల్సిందేనని పెద్ది తనలో తను అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Podarillu Today Episode, Podarillu September 5 Episode, Podarillu Serial Written Update, Podarillu Telugu Serial, Star Maa Podarillu, Peddi Second Marriage Episode, Jayanthi Second Marriage Truth, Narayana vs Peddi Fight, Telugu Serial Today Update]




