Home

»

Tv News

Illu illalu pillalu : వరలక్ష్మీవ్రతం రోజు ముగ్ధ ఎంట్రీ.. ధీరజ్, ప్రేమ కలుస్తారా!

Sep 6, 2026 8:47AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -572 లో....దొంగతనం నిందతో అలిగి తిరుపతి వేదవతి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వేదవతి ఎమోషనల్ అవుతుంది. మరోవైపు అమూల్యకు విశ్వ కాల్ చేసి రంభ థియేటర్ లో కొత్త సినిమాకు రమ్మని పిలుస్తాడు. అమూల్య ఫైర్ అవ్వడంతో అసలు ప్లాన్ చెప్తాడు. తన అన్నయ్య ధీరజ్, తన చెల్లి ప్రేమను కలపడానికి ఐడియా ఉందని అలాగే కాలేజ్ ఫెస్ట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలంటే ఆ సినిమాలోని కొరియోగ్రఫీ ఉపయోగపడుతుందని చెప్తాడు. తను బార్న్ డ్యాన్సర్ అంటూ డ్యాన్స్ చేసి కిందపడటంతో అమూల్య పగలబడి నవ్వుతుంది. ఆ నవ్వు చూసి విశ్వ.. ముత్యాన్ని పాలల్లో ముంచి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావంటూ ఫ్లర్ట్ చేస్తాడు.

అదే రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో ధీరజ్ ఇంటిని అలంకరిస్తుంటాడు. బాల్కానీలో నుంచి చూసిన ప్రేమ.. పెళ్లైన ప్రతి ఆడపిల్లకు వరలక్ష్మి వ్రతం ఎమోషన్, భర్తతో కలిసి పూజ చేసుకోవాలని బాధపడుతుంది. పోయినసారి కలిసి పూజ చేసుకున్నామని.. ఇప్పుడు మనసులు కలిసినా కలిసి పూజ చేసుకోలేకపోతున్నామని ధీరజ్ కూడా మనసులో బాధపడతాడు. విశ్వ వచ్చి.. మీ అత్తారింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకో అనడంతో, కళ్యాణ్ విషయం చెప్పనని మాటిచ్చి తన పరువు తీశాడని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు కచ్చితంగా వెళ్తావు.. నీ భర్తే నిన్ను ఆశీర్వదిస్తాడని విశ్వా ధైర్యం చెప్తాడు.

ఇంటి ముందు బాధగా కూర్చున్న వేదవతిని నర్మద వ్రతం కోసం లోపలికి తీసుకెళ్తుంది. ప్రేమ ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది.. కానీ ప్రేమను ధీరజ్ ఆశీర్వదించేలా చేయాలని అంటుంది. ఇంతలో ఇంటి ముందు ఆటో ఆగి అందులో నుంచి ముగ్ధ దిగుతుంది. ఆమెను చూసి ప్రేమ, ధీరజ్ ఇద్దరు షాక్ అవుతారు. ముగ్ధ నేరుగా వచ్చి ధీరజ్ ను గట్టిగా హగ్ చేసుకోవడంతో ప్రేమ కోపంతో రగిలిపోతుంది. ఎవరు ఈ అమ్మాయి అని రామరాజు, వేదవతి నిలదీయగా నర్మద ఫ్రెండ్ అని ధీరజ్ అబద్ధం చెప్తాడు. ముగ్ధ పేరు వినగానే వేదవతికి అనుమానం వస్తుంది. ఇదే ముద్దపప్పు అని నర్మద చెప్పడంతో వేదవతి కంగారుపడుతుంది. ఆ తర్వాత పూజారి రావడంతో అందరు వ్రతానికి సిద్ధమవుతారు.‌ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Illu Illalu Pillalu Today Episode, Illu Illalu Pillalu September 5 Episode, Illu Illalu Pillalu Serial, Star Maa Serial Illu Illalu Pillalu, Illu Illalu Pillalu Written Update, Varalakshmi Vratham Episode, Prema Dheeraj Story, Mugdha Entry Illu Illalu Pillalu, Telugu Serial Today Episode]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com