Home

»

Tv News

Podharillu :బస్ స్టాప్ అమ్మాయితో చక్రి ఓవర్ యాక్షన్.. మహా కళ్లలో నిప్పులు!

Sep 4, 2026 11:37AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్  200 లో...చక్రి రంగురంగుల బట్టలు వేసుకుని ఎలా ఉంది రా అని కన్నాని అడుగుతాడు. ఏం బాగాలేదని కన్నా అనడంతో ఇది మీ వదిన కొనిచ్చిన డ్రెస్ అని చక్రి బిల్డప్ ఇస్తాడు. నాలాంటి అందగాడ్ని చూస్తే మీకు కుళ్లు రా అని కన్నా, కేశవలతో చక్రి అంటాడు.

 

మహాని ఉడికించాలని బస్ స్టాప్ అమ్మాయి టాపిక్ తీస్తాడు చక్రి. పెళ్లయింది దెబ్బలు పడతాయ్ అని పెద్ది అంటే నాకు పెళ్లయిందా.. ఇదే మాట మహాలక్ష్మిని చెప్పమను అని చక్రి అంటాడు. మనం ప్రేమించే వారి కన్నా మనల్ని ప్రేమించే వారిని ప్రేమించాలని చక్రి అంటాడు‌. స్ప్రే కొట్టుకుని బాయ్ అంటూ మహాని మరింత ఉడికిస్తాడు. దీంతో మహా చైర్ ఎత్తి కొట్టినట్లు, కాలర్ పట్టుకుని నిలదీసినట్లు కల కంటుంది. ఇదంతా కలేనా అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్ పెడుతుంది.

 

బస్ స్టాండ్ దగ్గర చక్రి వెయిట్ చేస్తుండగా గోపిక, సత్య వస్తారు. నీ కోసం వచ్చాడంటూ సత్య గోపికతో అంటుంది. గోపిక చూస్తోందని చక్రి మరింత ఓవర్ యాక్షన్ చేస్తాడు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, ఫోన్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తూ గోపికను ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. అంతలో కన్నా, మహా అక్కడికి వస్తారు. మహా కోపాన్ని చూసి మరింత రెచ్చగొట్టాలని చక్రి అనుకుంటాడు. చివరకు గోపిక నంబర్ అడగడంతో చక్రి ఇచ్చేస్తాడు. కోపంతో మహా ఆటో ఎక్కి వెళ్లిపోతుంది.

 

మహా ఆఫీస్ వద్దకు పెద్ది వచ్చి తడబడుతూ పెళ్లిచూపుల విషయం చెప్తాడు. మాకు సంతోషంగా ఉందని మహా అంటుంది కానీ అసలు విషయాన్ని పెద్ది దాచిపెడతాడు. ఇంటికి వచ్చాక మహా చక్రిపై శాడిజం చూపిస్తుంది. ఇల్లు ఊడ్వండి.. నీళ్లతో తూడ్వండి.. సింక్ లో అంట్లు క్లీన్ చేయండి అంటూ ఆర్డర్లు వేస్తుంది మహా. ఎందుకండి నాకు ఇంత శిక్ష అని చక్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com