.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 103లో జానూ వాళ్ల ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి వాళ్లకు రూమ్ దొరకకుండా చేస్తాడు సింహాద్రి. దీంతో సింహాద్రికి జానూ వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత ఉదయం లక్కీ భర్త పెద్దావిడకు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తాడు. బామ్మ గారు ఇది మీ ఇల్లే అనుకోండి.. మీకు నచ్చినన్ని రోజులు ఉండండి అని అంటాడు. దానికి మురళి.. నిన్న రాత్రి మాట్లాడింది నువ్వే కదా.. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నావ్ కదా అని అంటాడు. దానికి అతను నేను అలా అన్నానా.. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు.. నేను మురళిని చూసి ఉత్తమ భర్త ఎలా ఉండాలో నేర్చుకోవాలని అంటాడు.
ఆ తర్వాత బాబిన్ కి మురళి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉంది.. వెళ్లి అవసరమైనవి కొనిచ్చి రా అని చెప్తాడు. అప్పుడే నందు వచ్చి ఫోన్ లాక్కొని వెటకారంగా మాట్లాడుతుంది. ఎంతసేపూ అమ్మ కాదు.. భార్యను కూడా పట్టించుకోవాలని నందు అంటుంది. దానికి మురళి కళ్లలోకి చూస్తూ పట్టించుకుంటున్నా అనడంతో నందు కోప్పడుతుంది. అప్పుడే జానూ వచ్చి బావా ఈ చెక్ ని అకౌంట్ లో వేసి రా అని చెప్తుంది. అతనికి ఎందుకు ఇస్తున్నావ్ తనకేం తెలియదు అని నందు అన్నా వినకుండా జానూ మురళికి ఇస్తుంది. దీంతో మురళి చెక్ తీసుకుని లక్కీ భర్తను తీసుకుని వెళ్తాడు.
మురళి వాళ్లు వెళ్తుండగా సూర్య బైక్ టచ్ అవుతుంది. సారీ అని చూస్తే మురళి కనిపిస్తాడు. మీ కోసమే వెతుకుతున్నా బ్రో అని సూర్య అనడంతో నువ్వు ఇంకెప్పుడూ మాకు కనిపించకు.. జానూ అసలు నీ వంక కూడా చూడదని మురళి అంటాడు. సూర్య మాట్లాడేలోపే మురళి అక్కడి నుంచి పరిగెడతాడు. ఆయాసంతో ఇంటికి వచ్చిన మురళిని ఏమైందని జాను అడుగుతుంది. తరువాయి భాగంలో కిన్నెర ఏడుస్తూ కూర్చుంటుంది.. నాన్న గుర్తువస్తున్నాడని చెప్పి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






