
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 570 లో.....ధీరజ్, ప్రేమలకి తిరుపతి తన ప్రేమ గురించి చెప్తాడు. సుకన్యని పెళ్లి చేసుకుంటానని అంటాడు. దాంతో ప్రేమ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్పేస్తానంటూ ప్రేమ ఫోన్ కలపబోతుంటే తిరుపతి కంగారుగా చిన్నల్లుడు ఆపురా.. సుక్కూతో పెళ్లి కాకపోతే బతకలేనని ధీరజ్ ను బ్రతిమాలతాడు.
దీంతో ధీరజ్ ప్రేమ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని మామ ఇన్నేళ్లలో అడిగిన కోరిక ఇదొక్కటే.. నెరవేర్చకపోతే ఎలా అని వాదిస్తాడు. వల్లి వల్లే ఇంట్లో ఎంత గొడవ వచ్చిందో చూశావ్ కదా.. ఇప్పుడు ఈమెను చేసుకుంటే ఇద్దరూ కలిసి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారని ప్రేమ అంటుంది. మీరు కొట్టుకుంటూనే ఉండండి.. ఈ గ్యాప్ లో మేం లేచిపోతామని తిరుపతి అనడంతో ఇద్దరు ఆపేస్తారు. చివరకు సాయంత్రం వచ్చే పెళ్లిచూపుల సంబంధాన్ని చెడగొడతానని ధీరజ్ మాటిస్తాడు.మరోవైపు పోయిన ఆరు లక్షల గురించి నర్మద ఆలోచిస్తూ చందును అడుగుతుంది. ఎవరి మీదైనా అనుమానం ఉందా అంటే వల్లి అక్క వాళ్లే చేసి ఉంటారని నర్మద చెప్తుంది. చందు మాత్రం వాళ్లు ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నారు.. మన డబ్బు ఎందుకు కొట్టేస్తారని నమ్మడు. డబ్బు బిర్యానీ, బందరు లడ్డు కాదు బావగారు.. కడుపు నిండగానే చాలు అనిపించదు.. అది వ్యసనం లాంటిది అని నర్మద అంటుంది. వాళ్లను మీరు నమ్మినంత సులువుగా నేను నమ్మను.. ఆ దొంగతనం వెనుక ఆ దొంగల ముఠానే ఉందని నర్మద అనుకుంటుంది.
ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ లు భద్రవతి తెచ్చిన సంబంధాన్ని చెడగొట్టడానికి వెళ్తారు. అది ఫైనాన్స్ బిజినెస్ చేసే చింతామణి ఇల్లు. రౌడీలు కత్తులు పెట్టడంతో ధీరజ్ భయపడతాడు. లోపలికి వెళ్లాక చింతామణి కూతురు బాలామణిని చూసి ఇద్దరు షాక్ అవుతారు. తిరుపతికి ఇది మూడో పెళ్లి.. మొదటి భార్య అరటి తొక్కపై జారి చనిపోయింది.. రెండో ఆవిడ ఉయ్యాల తాడు మెడకు చుట్టుకుని చనిపోయిందని ధీరజ్, ప్రేమ కథ అల్లడంతో చింతామణి భయపడి సంబంధం వద్దని పంపేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






