.webp)
స్టార్ మా టీవీలో ప్రసార్మవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 211 లో..... మందు తాగుతూ బాధపడుతున్న శేఖర్ వద్దకు వెళ్లి తనలో ఉన్న ప్రేమను బయటకు తీసేలా, జయంతికి అర్థమయ్యేలా చెప్పేలా ఓ ప్లాన్ ఇస్తాడు. ఇక తాంబూలాలు కూడా మార్చుకోవడంతో ఈ పెళ్లి జరుగుతుందేమోనని మహా భయపడుతుంది. నేను చేసేదంతా చేశానండి అని చక్రి చెప్తుంటాడు. జయంతి తన డ్రెస్ మార్చుకునేందుకు రూంలోకి వెళ్తుంది. బయటకు వచ్చేసరికి తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటుంది. అన్ని ప్రయత్నాలు చేశాం, ఇక ఈ ఎంగేజ్మెంట్ ను ఎవరు ఆపుతారోమని మహా బాధపడుతుంటే మందు బాటిల్ తో వెళ్తున్న శేఖర్ కనిపిస్తాడు. మంచి ఐడియా వచ్చిందంటూ చక్రి అతని వెంబడి వెళ్తాడు.
దానికి ఎంత పొగరు, మొదటి మొగుణ్ణి ఉండగానే నన్నే ఎంగేజ్మెంట్ కి పిలుస్తుందా అని బాధపడుతూ శేఖర్ తాగుతుంటే చక్రి గ్లాస్ పట్టుకుని వచ్చి.. మీలాంటి మంచివారికి ఇక్కడ స్థానం లేదని మాటలు కలుపుతాడు. నా భార్యే నన్ను అర్థం చేసుకోలేదు, మీరు చేసుకున్నారు బ్రదర్ అని శేఖర్ చక్రిని పిలిచి ఇద్దరు కలిసి తాగుతారు. చక్రి తాగలేక ఇబ్బంది పడతాడు. మీకు ఇప్పటికీ జయంతి అంటే ఇష్టమా అని చక్రి అడగ్గా.. ఇష్టం ఏంటి ప్రాణం, ప్రేమ, ఇష్క్, కాదల్, నాకు ఎవ్రీథింగ్ కానీ తనకి నేను నథింగ్ అంటాడు శేఖర్. అవమానం జరిగినా తప్పంతా నాదే, భార్య భరించే వరకే భర్త అని బాధపడుతుంటే.. నా ప్లాన్ ప్రకారం వెళ్తే వర్కౌట్ అవుతుందని చక్రి ప్లాన్ ఇస్తాడు.
ఇక అందరు ఎంగేజ్మెంట్ స్టేజ్ మీద కూర్చుంటారు. ఎంగేజ్మెంట్ సాఫీగా సాగుతూ ఉంటుంది. మీ ప్లాన్ ఏమైంది, జుట్టు పోలిగాడితో పెళ్లి ఆపించారు కదా అని మహా అంటే నేను చెప్పాల్సింది చెప్పా, ఆమె మన ఇంటికి రావాలని రాసుంటే ఎవరూ ఆపలేరని చక్రి అంటాడు. తాంబూలాలు మార్చుకోవడానికి జంట కావాలని పంతులు అడగ్గా చక్రి, మహాలను.. లక్ష్మీనారాయణుల జంట అని తీసుకోమంటాడు. తాంబూలాలు మార్చుకున్నాక జయంతి డ్రెస్ మార్చుకుని వచ్చి.. నాన్నా ఈ ఎంగేజ్మెంట్ జరగడం లేదని చెప్పడంతో నారాయణ, మహా, చక్రి ఫుల్ ఖుషీ అవుతారు. నేను మా అత్త ఇంటికి వెళ్తున్నా, ఆయన తప్పు తెలుసుకున్నాడు, మేం కాంప్రమైజ్ అయ్యామని శేఖర్ తో జయంతి వెళ్లిపోతుండగా.. మీరు చాలా గ్రేట్ అని చక్రిని మహా అనగానే చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






