Home

»

Tv News

Brahmamudi : పోలీస్ స్టేషన్ లో మదన్, స్వాతిల పెళ్లి చేసిన రాజ్!

Sep 17, 2026 10:30AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్  1138 లో...స్వాతి, మదన్ లు బ్రోతల్ కేసులో అరెస్ట్ అవుతారు. పోలీసులు రైడ్ చేసి వాళ్ల గది తలుపులు కొట్టి అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్తారు. మేము అలాంటి వాళ్లం కాదు.. బావా మరదళ్లం.. ఇల్లు రెంట్ కి దొరికే వరకు హోటల్ లో ఉన్నామని స్వాతి చెప్పినా పోలీసులు వినరు. బయటకు తీసుకొస్తుండగా మీడియా టీవీల్లో చూపిస్తుంది. ఆ న్యూస్ ని శేషు టీవీలో చూసి అరవడంతో అందరు వచ్చి షాక్ అవుతారు. నా కూతురి జీవితం సర్వనాశనం అయిందంటూ భ్రమరం ఏడుస్తుంది. వెంటనే భ్రమరం రాజుపై.. నీ వల్లే వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ కేసులో ఇరుక్కున్నారని తిడుతుంది.

 

ఫంక్షన్ పెట్టి లక్కీని కొడుకుగా అనౌన్స్ చేస్తున్న విషయం మదన్ కి తెలియదు.. మీరే వాడిలో ద్వేషం పెంచారని రాజును నిలదీస్తుంది రేఖ. ముందు స్టేషన్ నుంచి బయటకు తీసుకురావాలి అని ఇందు అంటుంది. మీ ఘనకార్యాలు చాలు అని రేఖ అంటుంది. మదన్ కి మీ మీద కోపం ఉంది.. ఇందు-రాజు వెళ్లడమే మంచిది అని అపర్ణ చెప్పినా భ్రమరం, రేఖ, భూషణం, శేషు ముందుగా స్టేషన్ కి వెళ్తారు. తర్వాత రాజు-ఇందు కూడా బయలుదేర్తారు. స్టేషన్ లో ఉన్న మదన్.. నేను ఇంటికి రాను‌ అని తెగేసి చెప్తాడు.

 

తరువాయి భాగంలో మీపై పడిన మచ్చ పోవాలంటే మీరు ఇక్కడే పెళ్లి చేసుకోవాలి.. పోలీస్ స్టేషన్ నుంచి భార్యాభర్తలుగా బయటకు వెళ్లాలని రాజు చెప్పడంతో మదన్ వెంటనే స్వాతి మెడలో తాళి కడతాడు. ఇద్దరు సంతోషంగా దండలు మార్చుకుంటారు. కానీ అక్కడే చూస్తున్న రేఖ, భ్రమరంలు షాక్ అవుతారు. బ్రోతల్ కేసు మచ్చను పోగొట్టడానికి రాజు వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అయినా భ్రమరం ఆగ్రహం మాత్రం చల్లారలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com