
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 780 లో.... శివన్నారాయణ ఆస్తుల్ని మాలిని మొత్తం లాక్కుంటుంది. కనీసం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేకుండా చేస్తుంది మాలిని. కానీ దీప హాస్పిటల్ లో ఉండటంతో అక్కడే ఉండిపోయిన జ్యోత్స్నకి ఈ విషయం తెలియదు. కార్తీక్ టెన్షన్ పడుతుండగా డాక్టర్ వచ్చి.. దీపకి ఆపరేషన్ అయ్యింది.. దీపకి ప్రమాదం లేదు.. ప్రెగ్నెన్సీకి కూడా సమస్య లేదని చెప్పడంతో కార్తీక్ ఊపిరి పీల్చుకుని థాంక్యూ అంటాడు. థాంక్స్ నాకు కాదు, దీప చెల్లెలు జ్యోత్స్నకి చెప్పండి, తనే బ్లడ్ ఇచ్చి కాపాడింది.. లేకపోతే దీప బతికేది కాదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ కన్నీళ్లతో జ్యోత్స్న చేతులు పట్టుకుని థాంక్స్ చెప్తాడు.
ఒకప్పుడు అగ్రిమెంట్ తో దీప ప్రాణాలకు ఖరీదు కట్టాను.. ఒక ప్రాణం విలువ ఆరోజు తెలియలేదు.. ఇప్పుడు నా తప్పులన్నీ నా రక్తంతోనే కడుక్కున్నా, మనిషిగా మారాననే ఆనందం ఉందని జ్యోత్స్న చెప్తుంది. థాంక్స్ నాకు కాదు బావా.. తీసుకొచ్చిన సూరజ్ కి చెప్పాలి.. నీకు ఫోన్ చేయించింది కూడా సూరజ్ నే.. నువ్వు వచ్చే ముందే వెళ్లిపోయాడని జ్యోత్స్న అంటుంది. రుణం తీర్చుకున్నా అన్నాడంటే జ్యోత్స్న అనుకున్నా జీవితాన్ని నవ్వులపాలు చేసినందుకు రుణం తీర్చుకున్నా అన్నట్టుగా ఉందని జ్యోత్స్న అంటే కార్తీక్ షాక్ అవుతాడు. నేను ప్రేమించి మోసపోయాను.. ఫ్యామిలీ పరువు పోగొట్టుకుంది.. దానికి కారణం సూరజ్, కారణం మీరే కదా బావా అని ప్రశ్నిస్తుంది.
నువ్వేం అనుకుంటున్నావని కార్తీక్ అడుగుతాడు. మీరు తప్పు చేయలేదని అన్నానంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే పగపట్టిన వాడికి సాయం చేసి ఆయుధం అయ్యారు. దీపని సూరజ్ ఆఫీస్ లోకి పంపింది ఎవరని నిలదీస్తుంది. మీరు అందరి నమ్మకాన్ని కోల్పోయారు. నా నమ్మకంతో సహా.. పోయిన నమ్మకాన్ని తీసుకురండి అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక సూరజ్ జ్యోత్స్నని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే లోపల మాలినిని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. నా ఇంట్లో నీకేం పని అని జ్యోత్స్న అంటే నీ వాళ్ల ఫోన్లు కూడా ఇక్కడే ఉన్నాయని రోడ్డుపై ఉన్న శివన్నారాయణ ఫ్యామిలీ దగ్గరకు తీసుకెళ్తుంది. మీ ఆస్తులు మొత్తం నావే, చేసిన పాపం ఊరికే పోదు, నువ్వు కొడితే చెంపపై గుర్తులు పడతాయి.. నేను కొడితే బతుకులు రోడ్డున పడతాయి. ఈ చేయి లేకుండా చేస్తానని జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి.. షర్ట్ చింపిన చేత్తోనే మామయ్య కాళ్లు పట్టుకువాలని మాలిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
