TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Podarillu: చిక్కుల్లో మహా.. ఆ ల్యాప్‌టాప్ ని చక్రి తీసుకొస్తాడా!

Nov 25, 2026 8:18AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podarillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -269లో.. ఉదయమే పూజ చేసి మహాలక్ష్మి దేవుడి ఆశీస్సులు తీసుకుంటుంది. ఆ తర్వాత నారాయణను ఆశీర్వదించమని కోరుతుంది. ఇవాళ ఆఫీసులో పెద్ద ప్రాజెక్ట్‌కు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నానని చెప్తుంది. చక్రి తన కారులో దింపుతానని అడిగినా అవసరం లేదని, నీ కారులో వెళ్తే అందరూ అదోలా చూస్తున్నారని వెటకారంగా చెప్పి కన్నాతో కలిసి బస్టాండ్ వరకు నడిచి వెళ్తుంది. బస్సు కోసం వేచి చూస్తే టైం అవుతుందని ఆటోలో వెళ్దామని ఆటో పిలుస్తుంది.

 

ఆఫీసు వద్దకు రాగానే దివ్యతో మాట్లాడుతూనే ఆటో దిగేస్తుంది. ఆటో డ్రైవర్‌కు ఫోన్‌పే లేకపోవడంతో డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్లిపోతుంది. ఆఫీసులోకి వెళ్లిన తర్వాత మహా కంగారుపడుతుంటే దివ్య వచ్చి కూల్ చేస్తుంది. క్లయింట్ చాలా పెద్దవాడని టెన్షన్‌గా ఉందని మహా అంటే, నువ్వు కాన్ఫిడెన్స్‌గా ఉంటే భయపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే విక్కీ నిన్ను ఆకాశానికెత్తేస్తాడని చెప్తుంది. అలా మాట్లాడుతుండగానే విక్కీ పిలుస్తాడు. తన క్యాబిన్‌లోకి వెళ్లిన మహాకు విక్కీ జాగ్రత్తలు చెప్తాడు. ఈ క్లయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ అని, ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే చాలా పెద్ద ప్రాజెక్ట్‌లు వస్తాయని చెప్తాడు.

ఒకసారి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చూపించమని విక్కీ కోరగా, మహా బయటకు వెళ్లి ల్యాప్‌టాప్ తీసుకుని వస్తానంటుంది. అక్కడ ల్యాప్‌టాప్ కనిపించకపోయేసరికి కంగారుపడుతుంది. ల్యాప్‌టాప్ ఆటోలో మర్చిపోయానని మహా భయపడుతుంది. ఇప్పుడు విక్కీకి ఏం చెప్పాలని, ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలని కంగారుపడుతుండగా విక్కీ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ల్యాప్‌టాప్ ఆటోలో మర్చిపోయానని, బ్యాకప్ కూడా పెట్టుకోలేదని చెప్పగానే విక్కీ మండిపడతాడు. చిన్నపిల్లల చేష్టలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ప్రెజెంటేషన్ పోస్ట్‌పోన్ చేయమని మహా అడిగితే క్లయింట్ సాయంత్రమే దుబాయ్ వెళ్లిపోతాడని.. అనుకున్న సమయానికి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందేనని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో మహాలక్ష్మి చక్రికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. చక్రి ఆటోస్టాండ్‌కు వెళ్లి ఆటోలన్నీ వెతుకుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img