TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Brahmamudi: రాజుకి గండం.. ఐశ్వర్యకి దక్కిన డీల్!

Nov 25, 2026 8:20AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1197 లో..బెడ్‌రూంలో కరెంట్ షాక్ పెట్టినా రాజు, ఇందులకు ఏమీ కాలేదని భ్రమరాంబ, రేఖ డిస్సపాయింట్ అవుతారు. అందరు కిందకు వెళ్లిపోయాక శోభనం గదిలోకి వెళ్లి వైర్‌ను చెక్ చేస్తారు. వెనకాలే వెళ్లిన శేషు అనుమానంగా శోభనం గదిలో మీకేంటి పని ఇక్కడ వాళ్లు తినగా మిగిలిపోయిన పళ్లు, స్వీట్లు తినాలని వచ్చారా అని అడుగుతాడు. రేఖ కోపంగా అన్నయ్య ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోమని అంటుంది. అందుకు శేషు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వెళ్లనంటాడు.

భ్రమరాంబ మాత్రం ఆయన ఉన్నా చేసేది ఏం లేదు రేఖ అసలు ఆ వైర్ ఉందా లేదా చూడు అంటే రేఖ బెడ్ మీద వైర్ తీసి చూస్తుంది. వైర్ బాగానే ఉంది కానీ ఎందుకు కరెంట్ షాక్ రాలేదని ఆలోచిస్తుంటారు. భ్రమరాంబ వైర్లు రెండు నోట్లో పెట్టుకుని చూస్తుంది. అప్పుడే శేషు స్విచ్ దగ్గరకు వెళ్లి ఆఫ్‌లో ఉందనుకుంటూ అని స్విచ్ ఆన్ చేస్తాడు. భ్రమరాంబకు కరెంట్ షాక్ తగిలి కింద పడిపోతుంది. అన్నయ్య ఏం చేశావంటూ రేఖ అడిగితే.. స్విచ్ ఆన్ చేశాను.. ఆ వైర్లు ఇటివ్వు చెల్లెమ్మా అంటూ వైర్లు తీసుకుని మళ్లీ భ్రమరాంబకు షాక్ ఇస్తాడు. భ్రమరాంబ లేచి కూర్చుంటుంది. ఆ దేవుడి స్క్రిప్ట్ ముందు మీ స్క్రిప్ట్ ఏం పనిచేయదంటూ ఇద్దరిని రూంలోంచి బయటకు తీసుకెళ్తాడు. ఎదురుగా వచ్చిన అపర్ణ రూంలోకి ఎందుకు వెళ్లారని నిలదీస్తే సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అవుతారు.

మరోవైపు కిచెన్‌లోకి సైలెంట్‌గా వెళ్లిన రాజు వెనక నుంచి ఇందు భుజం మీద చేయి వేస్తాడు. ఇందు ఉలిక్కిపడి అరుస్తుంది. తిరిగి చూస్తుంది. రాజు ఎందుకు అలా అరిచావంటే వెనక నుంచి సైలెంట్‌గా వచ్చి చెయ్యి వేస్తే భయపడరా ఎవరైనా అంటుంది ఇందు. నువ్వు ఒకరిని భయపెట్టే దానివి.. నువ్వు కూడా భయపడుతున్నావా అంటూ రాజు, ఇందును కిస్ చేయబోతుంటే అపర్ణ వస్తుంది. బిత్తరబిత్తర అవుతుంటే..రాజును కిచెన్‌లోకి ఎందుకు వచ్చావని అపర్ణ అడుగుతుంది. కాఫీ కోసమని.. టీ కోసమని కంగారు పడుతూ చెప్తుంటాడు రాజు. ఆ తర్వాత రూంలోకి వెళ్లి సుభాష్‌కు విషయం చెప్పి చాలా హ్యాపీగా ఫీలవుతుంది అపర్ణ. రాజు, ఇందు చాలా సంతోషంగా ఉన్నారని దీనికంతటికి కారణమైన స్వామిజీని రేపే కలిసి కృతజ్ఞతలు చెప్దామనుకుంటారు. అనుకున్నట్లుగానే.. మరుసటి రోజు అపర్ణ, సుభాష్ స్వామిజీని కలుస్తారు. కానీ స్వామిజీ మాత్రం షాకింగ్ విషయం చెప్తాడు. ఎవరి కోసమో పెట్టిన ముహూర్తంలో రాజు తాళి కట్టాడు కాబట్టి రాజు గండం ఇంకా పోలేదని, అది శత్రువు రూపంలో మరింత దగ్గర అయిందని, ఎప్పుడైనా మృత్యువు పొంచి రావచ్చని హెచ్చరిస్తాడు. స్వామిజీ మాటలకు అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు.

రుద్రప్రతాప్ డీల్ ఎవరికి దక్కుతుందోనని ఒకవైపు ఇందు టెన్షన్ పడుతుంటే మరోవైపు ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. అప్పుడే ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఇందు మెసేజ్ చూసి షాక్ అవుతుంది. ఏమైందని రాజు అడిగితే.. మెసేజ్ చూపిస్తుంది. నేను అనుకున్నదే జరిగింది రాజు.. ఈ డీల్ ఆ ఐశ్వర్యకే దక్కింది ఇప్పుడు ఐశ్వర్యను మనం ఆపలేము అంటుంది. వాళ్లే ఏదో రాంగ్ రూట్‌లో ఈ డీల్ దక్కించుకున్నారని రాజు అంటాడు. మరోవైపు డీల్ దక్కిందన్న విషయం తెలిసి ఐశ్వర్య సంతోషంతో రఘువీర్‌ను హగ్ చేసుకుంటుంది. తర్వాత తను చేయబోయే పనుల గురించి రఘువీర్‌కు చెప్తుంది ఐశ్వర్య. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img