TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Illu Illalu Pillalu: వల్లీ ప్రెగ్నెంట్..అబార్షన్ చేయించుకోమన్న చందు!

Nov 25, 2026 8:16AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-639 లో.. వల్లీని నర్మద తీసుకొని ఇంటికి రాగానే సాయంత్రం నుంచి సర్‌ప్రైజ్ ఇదేనా అని ప్రేమ అడుగుతుంది. ఎలివేషన్ వల్లీ అక్కకి కాదు.. అక్క కడుపులో బిడ్డకి అని నర్మద చెప్తుంది. వల్లీని నమ్మడానికి వీల్లేదని వేదవతి అనడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లి స్కాన్ చేయించి తెచ్చానని రిపోర్ట్ చూపిస్తుంది. వల్లీ పూర్తిగా మారిపోయిందని, తప్పులు తెలుసుకుందని నర్మద చెప్పడంతో అందరు సంతోషిస్తారు. వల్లీని నమ్మి తాతయ్య అవుతున్నానంటూ టపాసులు కాల్చమని రామరాజు సంబరపడతాడు.

అయితే సంబరం ఎంతో సేపు నిలవలేదు. టపాసులు కాల్చే టైంకి చందు ఇంటికి వచ్చి వల్లీని చూసి కోపంతో మెడ పట్టుకుని గెంటేయబోతాడు. వల్లీ కడుపుతో ఉందని వేదవతి చెప్పినా చందు నమ్మడు. గతంలో ఇలాగే నాటకం ఆడిందని గుర్తు చేస్తాడు. నర్మద తానే హాస్పిటల్‌కి తీసుకెళ్లానని చెప్పినా చందు వినడు. ఒకసారి మోసం చేశా కానీ ఇప్పుడు నిజం చెప్తున్నానని వల్లీ ఏడుస్తుంది. బిడ్డని అడ్డు పెట్టుకుని ఇంట్లోకి రావాలని చూస్తున్నావని చందు ఫైర్ అవుతాడు. నీ కడుపులో బిడ్డ నిజమైనా నాకు వద్దు, ఆ బిడ్డని తీయించేయమని అంటాడు. ఆ మాటలకు చందుని కొడుతుంది వేదవతి.

దాంతో చందు కోపంగా ఇంట్లోకి వెళ్లి బ్యాగ్ సర్దేసి తీసుకొస్తాడు. వల్లీ ఇంట్లో అడుగు పెడితే నేను వెళ్లిపోతానని తేల్చి చెప్తాడు. నాన్నకు నేను కావాలా, ఈ రాక్షసి కావాలా తేల్చుకోండని అంటాడు. మీరు వెళ్తే అత్తయ్య మామయ్య తట్టుకోలేరని వల్లీ ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇంట్లో తినకుండా కూర్చున్న వల్లీకి ఆనందరావు టిఫిన్ తినిపిస్తే భాగ్యం సిగ్గు లేకుండా తింటుందని తిడుతుంది. కడుపుతో ఉన్న దానిని అలా అనొద్దని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత నర్మద, ప్రేమ, ధీరజ్ వచ్చి వల్లీకి ధైర్యం చెప్తారు. పరీక్ష కోసం హైదరాబాద్ వెళ్తున్నానని, తన వాళ్ళకి ప్రేమ, ధీరజ్ అండగా ఉంటారని నర్మద చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img