
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 217 లో....మాధవ్‌ని ఇంట్లో అందరు కలిసి ఆటపట్టిస్తారు. మధ్యాహ్నం మనీషా భోజనం తెచ్చిందని, ఆమె కొసరి కొసరి వడ్డించినట్లు ఉందని చక్రి, కేశవ్, కన్నా సెటైర్లు వేస్తారు. కూరలో కారం ఎక్కువ, పప్పులో ఉప్పు ఎక్కువ, ఇది ఫ్రైయేనా అంటూ తలా ఒక వంక పెడుతూ మాధవ్‌ని ఉడికిస్తారు. లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అలానే ఉండటంతో అసలు విషయం బయటపడుతుంది. మనీషా సైట్‌కి భోజనం తెస్తే తినకపోతే ఫీల్ అవుతుందని తినలేదని మాధవ్ చెప్పడంతో.. అందుకే రోజూ సైట్‌కి వెళ్తున్నావా అని చక్రి ఆటపట్టిస్తాడు. దానికి కన్నా.. బుస్సు కోసం కేశవ అన్నయ్య రోజూ షాప్‌కి వెళ్లినట్లా అని కౌంటర్ వేయడంతో ఇంట్లో నవ్వులు పూస్తాయి.
మరోవైపు చక్రి గోపికను అడ్డుపెట్టుకుని మహాని ఉడికించాలని ప్లాన్ వేస్తాడు. లాయర్ కౌన్సిలింగ్‌కి పిలిస్తే మహా వెళ్లనని చెప్పడంతో చక్రి లోపల సంబరపడతాడు. తనకు విడాకులు ఇష్టం లేదనే వెళ్లలేదని స్టెప్పులు వేస్తాడు. తర్వాత గోపిక ఫోన్ రాగానే కావాలనే "గోపీ, బంగారం" అంటూ మహా ముందు ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇది చూసి కోపం తెచ్చుకున్న మహా రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. ఇంట్లో అందరు లవర్స్‌తో ఫోన్లో బిజీగా ఉండటం చూసి కన్నా .. నాకు తప్ప అందరికీ లవర్స్ ఉన్నారని బాధపడతాడు.
మాధవ్, మనీషాల మధ్య ఫోన్ ప్రేమాయణం స్టార్ట్ అవుతుంది. మొదట లవ్ సింబల్స్, థమ్సప్, నవ్వే ఎమోజీలు పంపుకున్న తర్వాత మనీషా.. బాగా మెక్కారా అని వాయిస్ మెసెజ్ పెడుతుంది. దానికి మాధవ్.. మెక్కారా కాదు, తిన్నారా అనాలని కరెక్ట్ చేస్తాడు. పప్పుచారు, కంద ఫ్రై, దోసకాయ పచ్చడిని హిందీలో..కటింగ్, తుక్డే తుక్డే, రుబ్బింగ్‌అంటూ చెప్తుంటే మనీషాకి "ఇమ్లీ" అనే పదం మాత్రమే అర్థమవుతుంది. ఇదంతా చూసిన మహా కర్ర తీసుకుని కన్నా.. నీకు లవర్ కావాలా అంటూ పరిగెత్తిస్తుంది. చక్రి వెనకాల కన్నా దాక్కోవడంతో ఇద్దరిని కలిపి చితకబాదుతుంది మహ. చిన్నపిల్లాడు ఉన్నాడని కూడా చూడకుండా ఫోన్లలో ఓవర్ చేస్తున్నారా అంటూ మహా కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Podharillu, Podharillu Episode 217, Star Maa Serial, Madhav, Manisha, Chakri, Maha, Keshav, Kanna, Gopika, Madhav Manisha Love Story]






