Home

»

Tv News

Karthika Deepam2 : చైర్మన్ గా సూరజ్.. కార్తీక్ ఎంట్రీతో షాక్!

Sep 24, 2026 9:46AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం 2 Karthika Deepam2.ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 786 లో.....జ్యోత్స్న బాధపడుతూ దీప, కార్తీక్ ల దగ్గర గతంలో నేను మీకు అన్యాయం చేశాను, కుట్రలు చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాను. ఇప్పుడు ఆ శిక్ష నేను, నా కుటుంబం అనుభవిస్తున్నామంటూ కన్నీళ్లు పెడుతుంది. మీ మీద నమ్మకం అందరికి పోయింది.. దాన్ని నిలబెట్టుకోండి. నేను మీకు సపోర్ట్ చేయొచ్చు కానీ ఎందుకు చేయనో తెలుసా దీప. బావ ఏ తప్పు చేయలేదు. వాళ్లని ఏమీ అనొద్దన్న మరుక్షణం తాత దాన్ని కూడా మార్చేశారా అని అంటాడు. అందుకే నేను మీ వైపు నిలబడలేను. ఏది జరిగినా నేను దశరథ, సుమిత్రల కూతురినే, వాళ్లు రోడ్డున పడితే నా సుఖం నేను చూసుకోలేనని తెగేసి చెప్తుంది. ఇదంతా మనమంతా కలిసి ఒక మాటపై ఉంటేనే జరుగుతుందని‌ దీప అనగానే దశరథ్ వచ్చి.. జ్యోత్స్నా నువ్వు లోపలికి వెళ్లు, మనం ఆశ్రయం పొందడానికి వచ్చిన శరణార్థులం, వీళ్లకి ఎంత దూరముంటే అంత మంచిది అని కూతురిని లోపలికి పంపుతాడు. నా కూతురు జ్యోత్స్నకి కాస్త దూరంగా ఉండండి. ఇదే ఈ తండ్రికి చేసే పెద్ద సాయమని దశరథ్ బాధతో వెళ్లిపోతాడు.

 

మరోవైపు మాలిని సూరజ్ ని.. జ్యోత్స్న రెస్టారెంట్స్ బాధ్యతలు తీసుకోమని అడుగుతుంది. అది నా గతం, అక్కడ దీప వదినకి నేను అడ్వైజర్ గా పని చేశా.. ఆ జ్ఞాపకాలు వెంటాడతాయి, గతంలోకి వెళ్లలేనని సూరజ్ తిరస్కరిస్తాడు. మనం భయపడుతున్నంత కాలం గతం నీడలా వెంటాడుతుంది.. నీ తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకున్నాం కాబట్టి ఈ బాధ్యత తీసుకో..‌ఇది తల్లిగా నా కోరిక అని మాలిని ఎమోషనల్ గా చెప్పడంతో సూరజ్ ఒప్పుకుంటాడు. నాకోసం అనుకుంటే చాలా చేయాలి, అవి నువ్వు తట్టుకోలేవు, నన్ను నీకోసం చేసే కొడుకుగానే ఉండనివ్వు అంటూ సూరజ్ వెళ్లిపోతాడు. ఈ నరకం నుంచి జ్యోత్స్నకి విముక్తి కల్పించాలని దీప, కార్తీక్ ప్లాన్ వేస్తారు. రేపు మనమిచ్చే షాక్ కి పిన్నికి తల తిరిగిపోవాలి..‌రేపటి నుంచి మన కొత్త ఆట మొదలవుతుందని కార్తీక్ అంటాడు.

 

ఆ తర్వాత మాలిని బోర్డు మీటింగ్ లో ..‌జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీకి సూరజ్ ని ఛైర్మన్ గా ప్రకటిస్తుంది. ఈ కంపెనీకి సంబంధించిన మార్పులు చేర్పులు అన్నీ సూరజ్ నిర్ణయంతోనే జరుగుతాయని చెప్పి ఖరీదైన పెన్ గిఫ్ట్ ఇస్తుంది. బోర్డు మెంబర్స్.. సీఈవో ఎవరని అడగగానే దీప, కార్తీక్ భారీ బిల్డప్ తో ఎంట్రీ ఇస్తారు. మేనేజర్ ఆపడంతో.. రేయ్ ఊసరవెల్లి, పార్టీలు మార్చే నువ్వు కూడా పంచ్ లు వేస్తున్నావా? వెళ్లి మీ మాలిని మేడమ్ కి చెప్పు సీఈవో వచ్చారని అని కార్తీక్ అంటాడు. అకౌంట్ సెటిల్ చేసి పంపించమని‌ మాలిని అనగానే సెటిల్ చేయాల్సింది నేను అత్తా, నేనే ఈ కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నాను.. మా బావ ఈ కంపెనీకి అడ్వైజర్ అని దీప అంటుంది. అధినేత మారాడు, నా కొడుకే నిర్ణయం తీసుకుంటాడని మాలిని అనగానే శివన్నారాయణ రాసిన అగ్రిమెంట్ పేపర్స్ ని " రాజశాసనం చూడండి" అంటూ కార్తీక్ బయటకు తీయడంతో సూరజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Karthika Deepam 2, Karthika Deepam 2 Episode 786, Star Maa Serial, Jyotsna, Deepa, Karthik, Suraj, Malini, Dasarath, Sumitra, Shivannarayana, CEO]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com