Home

»

Tv News

Illu Illalu Pillalu: శుభలేఖ, పెళ్లి చీరతో భద్రావతి ఇంటికి వేదవతి..

Sep 24, 2026 9:57AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 587లో.. భద్రావతి ఇంట్లోకి దూరిన ధీరజ్.. అయిపోయిందా భద్రం.. నువ్వు ఆ చింతామణే కాదు మీ తాత ముత్తాతలు దిగొచ్చినా మా పెళ్లి ఆపలేరు.. అందరి ముందు ప్రేమ మెడలో తాళి కడతా.. మా నాన్న ఛాలెంజ్ లో గెలిచి మీసం మెలి తిప్పేలా చేస్తానంటూ సవాల్ విసురుతాడు. దానికి వేదవతి కూడా.. వాచ్ పెట్టుకుని టైమ్ చూసుకో.. పదిన్నరకి పెళ్లి అంటూ భద్రావతికి కౌంటర్ ఇస్తుంది. భద్రావతి మాత్రం ప్రేమ మనసు మారదని, తనను దాటుకుని రాలేదని ధీమాగా చెప్తుంది.

 

అటు రామరాజు ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైంది. షాపింగ్ కి వెళ్లి ఇంట్లో అందరికీ బట్టలు తెస్తాడు. వేదవతి ముందు బెట్టు చేసినా, తర్వాత కొడుకు పెళ్లికి కొత్త చీర లేకపోతే ఎలా అని తీసుకుంటుంది. తర్వాత ప్రేమ కోసం తెచ్చిన చీరల్లో ఒకటి సెలెక్ట్ చేయమని ధీరజ్ ని అడుగుతారు. ఆచారం ప్రకారం పెళ్లి చీర, పసుపు కుంకుమ, మొదటి శుభలేఖ వియ్యంకుల ఇంటికి ఇచ్చి రావాలని నర్మదకు రామరాజు చెప్తాడు. దీంతో వేదవతి.. వెళ్లాల్సింది ఆయన.. మనల్ని వెళ్లమంటారేంటని కంగారుపడుతుంది.

 

ఇక పెళ్లి చీరతో భద్రావతి ఇంటికి వెళ్లేందుకు వేదవతి భయపడుతుంటుంది. మీరు శివగామి కదా.. మీరు భయపడటం ఏంటి అంటూ నర్మద ధైర్యం చెప్తుంది. ప్రేమకి నచ్చజెప్పి ఒప్పించాలని ప్లాన్ వేస్తుంది. ఇంతలో వల్లీని కూడా.. నువ్వు కూడా రా బల్లి అక్కాయ్ అంటూ బలవంతంగా లాక్కెళ్తుంది. వల్లీ మాత్రం ఇప్పటికే తిరుపతి, సుకన్యల పెళ్లిలో తన హస్తం ఉందని భద్రావతి అనుకుంటోంది.. ఇప్పుడు వెళ్తే తన పని అయిపోతుందని టెన్షన్ పడుతుంది.

 

మరోవైపు వేదవతి మరో ప్లాన్ వేస్తుంది. ధీరజ్ తో..‌కారు రెడీగా పెట్టరా చిన్నోడా.. ప్రేమను కిడ్నాప్ చేసేద్దామని అంటుంది. ప్రేమ ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు కాబట్టి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మాట్లాడి ఒప్పిద్దామనేది ఆమె ఐడియా. ధీరజ్ షాక్ అవుతాడు. అసలు భద్రావతి ప్రేమకు సెక్యూరిటీ పెట్టిందని, పెళ్లి ఆపేందుకు మనుషులను పెట్టిందని తెలుస్తోంది. మరి వేదవతి కిడ్నాప్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Illu Illalu Pillalu, Illu Illalu Pillalu Episode 587, Star Maa Serial, Dheeraj, Prema, Bhadravathi, Vedavathi, Ramaraju, Narmada, Valli, Wedding]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com