TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Karthika Deepam2: సూరజ్ కి తగిలిన బుల్లెట్.. మాలిని ప్లాన్ ఫెయిల్!

Nov 24, 2026 9:04AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2' (Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -837 లో... సూరజ్, జ్యోత్స్న ఓ చోట కలుసుకుంటారు. మీ గ్రానీ చెప్పాల్సింది అంతా చెప్పేసింది ఇంకేంటని సూరజ్ అడుగుతాడు. దానికి జ్యోత్స్న నువ్వంటే నాకు అసహ్యం, నువ్వు నాకు నచ్చలేదు, నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నా, మా డాడీ ఆస్తి ఇస్తా అంటేనే పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ నువ్వు నన్ను రిజెక్ట్ చేశావ్ నా ఇగో దెబ్బతింది అని చెపగతుంది. తెలీకుండా నీతో ప్రేమలో పడిపోయా, నీకోసం తపించా, ఆస్తి ఉంటే లగ్జరీగా బతికేయొచ్చు అనుకున్న నాకు సూరజ్ ఉంటే చాలు బతికేయొచ్చనేలా చేశావని జ్యోత్స్న ఎమోషనల్ గా చెప్తుంది.

తాళి తిరిగి ఇచ్చేసిన సూరజ్.. జ్యోత్స్న చాలా ఎమోషనల్ గా చెప్పినా సరే సూరజ్ మాత్రం ఇదంతా అబద్ధం, నీ ప్రేమని అమ్మేశావని అంటాడు. ఎన్నైనా చెప్పు కానీ నా ప్రేమని అబద్ధం అనొద్దని జ్యోత్స్న అంటుంది. ఇక సూరజ్ నీ వస్తువు ఒకటి నా దగ్గర ఉండిపోయిందని తాళి తీసి జ్యోత్స్నకి ఇస్తాడు. ఇది నీ దగ్గరకు ఎలా వచ్చిందని జ్యోత్స్న అడిగితే దీప వదిన ఇచ్చింది..‌అన్నీ తిరిగి ఇచ్చేసింది తాళితో సహా ఇక నువ్వు వెళ్లు అని అంటాడు. జ్యోత్స్న తాళి బ్యాగ్ లో పెట్టుకొని బయల్దేరుతుంది. జ్యోత్స్నని చంపాలని మాలిని మనిషి అక్కడే కాపు కాస్తాడు. గన్ తో జ్యోత్స్నని కాల్చేయాలని గురి పెడతాడు. జ్యోత్స్న వెళ్తూ నేను నీ కోసమే బతుకుతున్నా చచ్చినా నీ కోసమే చస్తానని అంటుంది. రౌడీ గన్ గురి పెట్టి కాల్చడం చూసిన సూరజ్.. జ్యోత్స్నని కాపాడటానికి వెళ్తాడు.. బుల్లెట్ సూరజ్ కి తగులుతుంది.. జ్యోత్స్న షాక్ అయిపోతుంది.

జ్యోత్స్న ఏడుస్తూ సూరజ్ లేరా అంటూ అక్కడున్న వాళ్ల సాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. జ్యోత్స్న దీప, కార్తీక్ లకు విషయం చెప్తుంది.. ఇద్దరూ హాస్పిటల్ కి చేరుకుంటారు. జ్యోత్స్న తనని ఎవరో కాల్చడానికి వస్తే సూరజ్ కాపాడాడని చెప్పి ఏడుస్తుంది. ఇక డాక్టర్ వచ్చి గుండె కింద బుల్లెట్ దిగింది.. త్వరగా బ్లడ్ ఎక్కించాలి..‌రేర్ గ్రూప్ ఆ బ్లడ్ దొరకడం చాలా కష్టం.. త్వరగా డోనర్ ని చూడండి అని చెప్తారు. జ్యోత్స్న తనని కాపాడండి అని ఏడుస్తుంది. కార్తీక్, జ్యోత్స్నలు గ్రూప్స్ లో మెసేజ్ లు పెడుతూ బ్లడ్ కోసం తెలిసిన అందరికి ఫోన్లు చేస్తారు. మాలిని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతలో ఓ డోనర్ రక్తం ఇస్తానని కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img