Home

»

Tv News

Karthika deepam 2 : సుమిత్రకు దీప ప్రాణదానం.. జ్యోత్స్న పేరుతో కార్తీక్ మాస్టర్ ప్లాన్!

Mar 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -623 లో..... దీపని ఆపరేషన్ థియేటర్ కి తీసుకొని వెళ్ళడానికి డాక్టర్ హారిక ట్రై చేస్తుంటే.. పారిజాతం వాళ్లని గమనిస్తూ ఉంటుంది. దాంతో హారిక టెన్షన్ పడుతుంది. ఇలాంటి సిచువేషన్ ఎప్పుడు రాలేదు కార్తీక్.. ఇక్కడేమో పారిజాతం ఉంది. అక్కడేమో మీ తాతయ్య ఉన్నాడని హారిక అనగానే ఇప్పుడు మా పారు అక్కడ లేకుండా చెయ్యాలి అంతే కదా అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత పారిజాతానికి దాస్ ఫోన్ చేస్తాడు. అమ్మ నీ మనవరాలు ఎక్కడ ఉందో అడ్రెస్ దొరికింది అమ్మ అనగానే పారిజాతం.. ఆనందం పట్టలేక నువ్వు ఎక్కడ ఉన్నావ్ రా వస్తున్నానని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు దీపని హరిక ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకొని వెళ్తుంది.అక్కడ జ్యోత్స్న ఒక బెడ్ పై మరొక బెడ్ పై సుమిత్ర ఉంటుంది. జ్యోత్స్నకి మత్తు ఇచ్చారు.. దీప రావడం చూసి దీప అంటుంది. ఆ తర్వాత స్పృహలో ఉండదు. ఆ తర్వాత బోన్ న్యారో దీప నుండి సుమిత్రకి మారుస్తారు. ఇక అందరి దృష్టిలో జ్యోత్స్న బోన్ న్యారో డోనర్ అని నమ్మెటట్లు చేసారు. మరొకవైపు దాస్ దగ్గరికి పారిజాతం వెళ్తుంది. నా మనవరాలు ఎక్కడరా అని అడుగుతుంది నీపై కోపంగా ఉంది అమ్మ.. ముందు ఈ నీళ్ళు తాగని ఇస్తాడు. దాంతో పారిజాతం వాటర్ తాగి స్పృహ కోల్పోతుంది.

 ఆ తర్వాత జ్యోత్స్న స్పృహలోకి వచ్చి ఆపరేషన్ కి ముందు దీప కన్పించింది.. ఎందుకు వచ్చిందని జ్యోత్స్న అడుగుతుంది. తను ఇక్కడికి ఎందుకు వచ్చింది తనకి చిన్న ఆపరేషన్ జరిగింది అక్కడికి వెళ్ళిందని డాక్టర్ హారిక చెప్తుంది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ పై ఉంటుంది. తన చుట్టూ అందరు ఉంటారు. ఏమైందని పారిజాతం అడుగుతుంది. ఆ తర్వాత దీప దగ్గరికి పారిజాతం వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com