
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -424 లో... వేదవతి వాళ్ళ అమ్మ, పెద్దమ్మ ఇద్దరు రామరాజు దగ్గరికి వస్తారు. జరిగింది ఏదో జరిగింది కానీ విశ్వకి అమూల్యని ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతారు. అది కుదరదు.. నాపై ఎంత కోపం ఉందో నాకు బాగా తెలుసు.. అలాంటిది నేను తెలిసి తెలిసి ఎందుకు ఇలా చేస్తాను.. నా కూతురు నాలుగు రోజులు ఆ ఇంట్లో ఉంటేనే ప్రాణం పోయినట్టు అనిపించిందని రామరాజు చెప్తాడు. నా చెల్లికి వచ్చిన డోకా ఏం లేదు ఎప్పటిలాగే చదువుకుంటుందని ధీరజ్ చెప్తాడు. దాంతో వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత చిన్నోడికి బాధ్యత తెలియదని అనుకున్నాను కానీ తన చెల్లి విషయంలో చాలా బాధ్యతగా ఉన్నాడని రామరాజు అంటాడు. ఇకనుండి అమూల్య విషయంలో ధీరజ్ దే బాధ్యత.. మిల్ విషయం లో పెద్దోడిదే బాధ్యత అని రామరాజు చెప్తాడు. ఇక నడిపోళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని రామరాజు అనగానే సాగర్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేదవతి గోడ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మని పిలిచి తను లేనప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. అందుకే అయన అంత కఠినంగా మాట్లాడాడు అమ్మ అని వేదవతి చెప్తుంది. మరొకవైపు నర్మద ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్తుంది. శ్రీవల్లి హడావిడిగా రోడ్డుపై ఇడ్లీ అమ్ముతున్న భాగ్యం వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ విశ్వ గాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారని చెప్తుంది. అయితే ఏంటే అని భాగ్యం అంటుంది. అప్పుడే సాగర్ కి జాబ్ ఇప్పించిన బ్రోకర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు నా దగ్గరికి వచ్చిన వాళ్లే కదా అంటాడు. నర్మద రావడం చూసి భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావు అక్కడ నుండి పారిపోతారు. నర్మద వాళ్ళని చూసి ఎందుకు పారిపోతున్నారనుకుటుంది. ఆ బ్రోకర్ అక్కడే ఉండి మీరు సాగర్ వైఫ్ కదా నాకు కమిషన్ తక్కువ ఇచ్చాడు.. మీరు ఇవ్వండి అని అంటాడు. దాంతో నర్మద అతని చెంపచెల్లుమనిపిస్తుంది. అసలు నువ్వు ఆ రోజు పార్టీకి ఎందుకు వచ్చావని నర్మద అడుగుతుంది.
ఇందాక పారిపోయిన వాళ్ళు వచ్చి జాబ్ కావాలి అన్నారు.. డబ్బు ఇస్తాను రమ్మంటే వచ్చానని అతను చెప్తాను. వీళ్లేనా అని భాగ్యం వాళ్ళ ఫోటో చూపిస్తుంది నర్మద. వాళ్లే అని అతను చెప్తాడు. అంటే సాగర్ జాబ్ గురించి బయటపెట్టింది వీళ్ళే అన్నమాట అని నర్మద అనుకుంటుంది. మరొకవైపు ప్రేమతో ధీరజ్ మాట్లాడడు. తన చేత్తో ఏది ఇచ్చిన తీసుకోడు. తరువాయి భాగంలో నర్మద ప్లాన్ చేసి శ్రీవల్లినే అమూల్య లవ్ ట్రాక్ నడిపిందని తన నోటితో చెప్పేలా చేస్తారు. శ్రీవల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ లో చెప్పడం నర్మద, ప్రేమ ఫోన్ లో వింటారు. వేదవతి డైరెక్ట్ గా వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

