
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -222 లో...... రుద్ర ఒక్కడే కూర్చొని ఆలోచిస్తుంటే తన దగ్గరికి రంగా వచ్చి బావ నీకొక విషయం చెప్పాలని అంటాడు. ఏంటని రుద్ర అడుగుతాడు. మా పిన్ని, బాబాయ్ గంగ పేరెంట్స్ కాదు.. ఆ విషయం నాకు మొన్నే తెలిసిందని రంగా అనగానే రుద్ర షాక్ అవుతాడు. మా పిన్ని బాబాయ్ నేను నీలదీసాక చెప్పారని రంగా అంటాడు. ఎలాగైనా తన పేరెంట్స్ దగ్గరికి గంగని చేర్చాలని రంగా అంటాడు. అప్పుడే గంగ ఎంట్రీ ఇచ్చి.. ఎవరి దగ్గరికి చేర్చాలని అంటున్నారని అంటుంది.
దాంతో రంగా కవర్ చేస్తాడు. మరొకవైపు పైడి రాజు, లక్ష్మి మాట్లాడుకుంటారు. చేసిన తప్పుకి ప్రాయశ్చితం చేసుకునే అవకాశం లేకుండా అయిందని లక్ష్మీ బాధపడుతుంది. మరొకవైపు ఆఫీస్ నుండి రాఘవ, సూర్య వస్తారు. ఈ రోజు ఆఫీస్ లో పడుకున్నావా అని రంగా అడుగుతాడు. బాబాయ్ సూర్య ఇద్దరు ప్రతి పనిలో ఇన్వాల్వ్ అయి ఫైల్స్ చెక్ చేస్తూ బిజీగా ఉన్నారని రుద్ర చెప్తాడు.
వాళ్ళు చేసేది ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేసాను.. ఎందుకు అంటే వాళ్ళకి మొదటి రోజు కదా అని పెద్దసారు అంటాడు. మరొకవైపు ప్రమీల సూపర్ మార్కెట్ నుండి వస్తుంటే కార్ ట్రబుల్ ఇస్తుంది. అప్పుడే గుడిలో ప్రసాదం దగ్గర సూపర్ మార్కెట్ లో పరిచయం అయిన కార్తీక్ వస్తాడు. హెల్మెట్ పెట్టుకొని ఉంటాడు. అతన్ని ప్రమీల లిఫ్ట్ అడుగుతుంది. తరువాయి భాగంలో అతని బైక్ పై ప్రమీల రావడం శకుంతల చూసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళగానే బరి తెగించావా అని అనగానే ప్రమీల బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






