Home

»

Tv News

బిగ్ బాస్ హౌస్ లోకి నూకరాజు....

Aug 22, 2026 2:43PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష జరుగుతోంది. ఇది కామనర్స్ కోసం చేస్తున్న సెలెక్షన్స్. ఐతే ఇప్పుడు సెలబ్రిటీస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు వెళ్తారు హౌస్ లోకి వీళ్ళు హౌస్ లోకి వెళ్తారు అనే టాక్ చాలా నడుస్తోంది. బుల్లి తెర నుంచి ఎక్స్ప్రెస్ హరి, జబర్దస్త్ కమెడియన్ నూకరాజు వెళ్తారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు వెళ్తారు అనేది ఫైనల్ గా తెలీదు. ఇకపోతే రీసెంట్ గా ఒక చిట్ చాట్ లో నూకరాజు తానూ బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నానా లేదా అన్న విషయాన్నీ రివీల్ చేసాడు.

"బిగ్ బాస్ అలజడి మాములుగా లేదు. బిగ్ బాస్ లో నువ్వు ఉంటావని టాక్ నడుస్తోంది " అని హోస్ట్ అడిగేసరికి  నూకరాజు ఆన్సర్ ఇచ్చాడు. "టాక్ వచ్చింది కాబట్టి అంది కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది సెప్టెంబర్ రెండో వారం వరకు వెయిట్ చేయాల్సిందే  అది టెలికాస్ట్ అయ్యేవరకు. "బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టం " అని అడిగేసరికి " బిగ్ బాస్ అంటే చూస్తాను బాగా లైక్ చేస్తాను చాలా ఇష్టమే. ఒక ఇండివిడ్యువల్ పర్సనాలిటీ ఏంటి అనేది అందులోకి వెళ్ళాక తెలుస్తది. ఆల్రెడీ నేను ఒక రియాలిటీ షో చేసొచ్చాను. ఇక మా పర్సనాలిటీ ఏంటి అనేది అందరికీ తెలుసు. అది కూడా ఆడియన్స్ కపుల్ గా ఉన్నప్పుడు చూసారు. కాకపోతే బిగ్ బాస్ ఏంటంటే ఇండివిడ్యువల్ గ చూస్తారు  నేనేంటి అనేది. కానీ ఏమవుతుందో చూడాలి. అన్నీ సక్రమంగా ఉంటే హౌస్ లో చూస్తారు." అని చెప్పుకొచ్చాడు.

ఇటీవల మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి నూకరాజు - ఆసియా జోడి వెళ్లి బాగా టాస్కులు ఆడారు. అలాగే ఎంటర్టైన్ చేశారు. జడ్జెస్ మెప్పు పొందారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి నూకరాజు వెళ్తాడా లేదా అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com