
ఢీ షో 20 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఇక కప్పుని రాజు కొట్టాడు. ఈ సీజన్ పూర్తయిపోయింది. ఐతే నెక్స్ట్ సీజన్ గురించిన అప్ డేట్స్ ఇంతవరకు బయటకు రాలేదు. ఐతే ఫినాలే ఎపిసోడ్ లో ఢీ షోకి కొంచెం బ్రేక్ రాబోతోంది అంటూ చెప్పారు. ఐతే బ్రేక్ రావడం కరెక్ట్ కాదు అంటూ ఆడియన్స్ కూడా కోరుకున్నారు అలాగే ఈ ఎపిసోడ్ కి వచ్చిన కొంత మంది సీనియర్ కొరియోగ్రాఫర్స్ కూడా బ్రేక్ ఇవ్వడం సరి కాదు అన్నారు. మరి ఎప్పుడు కొత్త సీజన్ అప్ డేట్ వస్తుంది అన్న విషయం తెలీదు.
ఐతే ఈ ఢీ షోలో సంకేత్ కూడా ఫైనలిస్ట్ అయ్యాడు. ఐతే తనకు ట్రోఫీ రాకూడదు అంటూ ఎవరో చెప్తున్న ఒక విషయాన్నీ సంకేత్ కో-కంటెస్టెంట్ నైనికా సంకేత్ తో కలిసి వ్లాగ్ చేసింది. ఆ విషయాన్నీ ఈ వీడియోలో చెప్పింది. ఢీ షోలో రెండు గ్రూప్స్ ఉంటాయి. కానీ సంకేత్ వేరే గ్రూప్ నుంచి వచ్చాడు. అది వేరే గ్రూప్. ఈ గ్రూప్ క్లాషెస్ లో ఒక ఈవెంట్ లో కొన్ని విషయాలు నా చెవిన పడ్డాయి. ఇటు వైపు ఉన్న పర్సన్ కి అటు వైపు గ్రూప్ నుంచి ఒక కంటెస్టెంట్ కాల్ చేసి ఏదైతే అది అయ్యింది కానీ సంకేత్ కి అస్సలు ట్రోఫీ వెళ్ళకూడదు అన్న మాటల్ని ఇవతల వైపు ఉన్న నేను వినేసాను. ఐతే ఈ విషయాలు నాకు తెలిసిపోయాయి అని నా పక్కన ఉన్న కంటెస్టెంట్ ఎవరికీ ఎం చెప్పొద్దూ అంటూ బతిమాలాడేసరికి ఇవన్నీ ఇలా ఉంటాయని నాకు తెలుసు అని చెప్పాను " అంటూ అవార్డ్స్ విషయంలో క్లారిటీ ఇచ్చింది.
ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగింది. "జనాలకు ఎందుకు అనిపిస్తోంది మనం రిలేషన్ షిప్ లో ఉన్నామని " అని అడిగింది. "ఎందుకంటే మనం కలిసి రీల్స్ చేస్తూ షార్ట్స్ చేస్తూ ఉంటామని కదా అందుకేనేమో " అన్నాడు సంకేత్ . "అవును అతను చాలామందితో రీల్స్ చేస్తాడు నేను కూడా చాలా మందితో రీల్స్ చేస్తాను . కానీ కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు చెప్పట్లేదు కానీ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని వస్తారు " అని ఆ కామెంట్స్ ని చెప్పి నైనికా నవ్వుకుంది.




.webp)

