Home

»

Tv News

నవదీప్ కి ఇంత పిల్లాడు ఉన్నాడా!

May 07, 2026

బుల్లితెర మీద జబర్దస్త్ రేంజ్ లో అలరించే కామెడీ షో ఇంతవరకు లేనే లేదు. ఐతే రీసెంట్ గా జీ తెలుగులో కొత్తగా ఒక కామెడీ షో మొదలయ్యింది. అదే మాస్ జాతర. ఆడియన్స్ కి కొద్దికొద్దిగా కనెక్ట్ అవుతూ వస్తోంది. హోస్టులుగా అమరదీప్, దీపికా రంగరాజు, సుప్రీతా ఉన్నారు. జడ్జెస్ గా జానీ మాష్టర్, నవదీప్, బిందు మాధవి ఉన్నారు. ఈ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నవదీప్ ఒక స్కిట్ లో చేసాడు.

అది బాగా ఫన్నీగా ఉంది. నవదీప్ భార్యను అంటూ ఒక లేడీ ఆర్టిస్ట్ చేసిన హంగామా మాములుగా లేదు. "ఏయ్ నవదీపు "ఏయ్  నవదీపు ... ఇంట్లో పిల్లాడికి డైపర్  మార్చాలా , వంట చేయాలి… అవన్నీ మానుకుని నువ్వేం చేస్తున్నావ్ ఈడ  ..దా ఇంటికి రా " అంది. "నువ్వెవరమ్మా " అంటూ నవదీప్ సీరియస్ గా అడిగాడు. "పెళ్ళాన్నే మర్చిపోయావా నువ్వు " అంది ఆర్టిస్ట్. "ఎవరి పెళ్ళానివమ్మా " అన్నాడు. "నీకే నీకే" అంది.

అంతే షాకయ్యాడు నవదీప్. "ఎందుకట్లా అబద్దాలాడుతున్నావ్" సూడు అంటూ తన సంఖ్యలో ఉన్న బిడ్డలాంటి ఒక వ్యక్తిని టేబుల్ మీద నిలబెట్టింది. "సేమ్ కళ్ళు సేమ్ పోలికలు అచ్చం నాన్న పోలికలే" అన్నారు లేడీ ఆర్టిస్టులంతా కలిసి. దానికి నవదీప్ నవ్వలేక చచ్చిపోయాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com