
ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి తమన్నా సింహాద్రి నిండుగా పెద్ద ముత్తైదువులా వచ్చింది. మొదట్లో బాగా నవ్వించింది కానీ లాస్ట్ లో బాగా ఎమోషనల్ అయ్యింది. "ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్ తిడితే " అనే సాంగ్ కి డాన్స్ చేశారు శ్రీముఖి, తమన్నా సింహాద్రి. "నీకొక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను" అని చెప్పింది తమ్మన్న. పెద్ద అట్టపెట్టె ఓపెన్ చేసేసరికి అందులో పింక్ కలర్ టెడ్డి బేర్ చూసి శ్రీముఖి ఫుల్ ఖుషీ ఐపోయింది. "ఈ టైములో బెడ్ మీద మొగుడు ఉండాలి కానీ శ్రీముఖి బెడ్ మీద చాలా టెడ్డి బేర్ లు ఉంటాయి" అని చెప్పింది
తమన్నా సింహాద్రి. "తమన్నా గారు మీ ఇద్దరి మధ్య అసలు ఫ్రెండ్ షిప్ ఎలా అయ్యింది. ఒకసారి మీరు చెప్తారు " అని అవినాష్ అడిగాడు. "బిగ్‌బాస్ నాకిచ్చిన పెద్ద గిఫ్ట్ శ్రీముఖి .వరల్డ్. నా ప్రపంచమే శ్రీముఖి. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు నేను ఇల్లు కట్టిస్తా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు అంది. మాటలు ఎంతో మంది చెప్తారు కానీ ఆ కలను నెరవేర్చటం అనేది మాత్రం అది శ్రీముఖికి సాధ్యం అయ్యింది." అంటూ ఎమోషనల్ అయ్యింది. " నథింగ్ నథింగ్ నేను చేసింది ఏమీ లేదు.
నేను ఒకటే ఒకటి చెప్తా తమన్నా ని ఇంకా ఎందుకు చేరదీస్కోలేరో వాళ్ళ అమ్మానాన్న అన్నయ్య అనేది నాకు తెలీదు నేను మాత్రం తనకి ఎప్పటికీ ఉంటానని మాటిస్తున్నాను" అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.




.webp)
.webp)
