Home

»

Tv News

వామ్మో వీళ్ళు ఇంత నాటీ పనులు చేశారా!

May 07, 2026

కుక్కు విత్ జాతి రత్నాలు షో లేటెస్ట్ ప్రోమో మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా రాబోతోంది. ఇందులో నిఖిల్ విజయేంద్ర సింహ, పల్లవి గౌడ, పల్లవి రామిశెట్టి, రాకింగ్ రాకేష్, కళ్యాణ్ పడాలా, ఆషిక వాళ్ళ అమ్మలతో కలిసి వచ్చారు.  వాళ్లంతా రాగానే జడ్జ్ శ్రీదేవి  "మీరు చెప్పాలి మీ పిల్లలు ఎం అల్లరి  చేశారు" అంది.  "చెప్పాలంటే చాలా ఉన్నాయి నాన్న అతను చాలా  రిజర్వ్డ్ గా ఉంటాడు" అంటూ నిఖిల్ గురించి వాళ్ళ అమ్మ చెప్పింది. " రిజర్వ్డ్ ఆ ఎంత మంది కోసం టేబుల్స్ రిజర్వ్ చేసాడో తెలుసా వీడు" అని రోహిణి పరువు తీసేసింది.  "అత్తయ్య గారు అబ్బాయి చేసిన అల్లరి పనుల గురించి చెప్పండి" అని రోహిణి కళ్యాణ్ పడాలా వాళ్ళ అమ్మను అడిగింది. "సిగ్గుపడతారేంటండి మీరు" అన్నాడు కళ్యాణ్. "మా అబ్బాయి చాలా సైలెంట్ గా ఉంటాడు" అని వాళ్ళ అమ్మ చెప్పింది.

" మీకు తెలీదు ఎన్నెన్ని చేశాడో తెలుసా ఎపిసోడ్స్ లో" అంది రోహిణి. "నాకు తెలుసు ఎం చేయలేదు" అని చెప్పింది వాళ్ళ అమ్మ. "ఆరేళ్ళ వయసులో  తెలియకుండా ఒకసారి కత్తిరి తెచ్చుకొని జుట్టు అంతా కట్ చేసేసుకుంది" అంటూ పల్లవి రామిశెట్టి వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది. తర్వాత ఆషిక గురించి వాళ్ళ అమ్మ చెప్పింది. "ఆమె పుట్టుకతోనే యాక్టర్ "అని. తరువాత పల్లవి గౌడ వచ్చి వాళ్ళ అమ్మను చూపించి "మా అమ్మ పేరు లక్ష్మి ఈవిడ మా ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మి ఎప్పుడు బానే ఉంది మా ఇంట్లో " అని చెప్పింది. " మా ఇంటి రారా కొంచెం...మా ఇంటికి కూడా  రండి" అంటూ శ్రీదేవి, అలీ అడిగారు కామెడీగా.  తర్వాత రాకేష్ వాళ్ళ అమ్మను తీసుకొచ్చాడు.

"మా అమ్మ జయలక్ష్మి గారు జయలక్ష్మీలో జ‌యం ఎప్పుడు నాకిచ్చేసి లక్ష్మీల మా ఇంట్లో ఉన్న మా అమ్మ మా అమ్మ అంటే చాలా ఎమోషన్ నాకు బేసికల్లీ ఎందుకంటే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా పెంచింది.  చాలా ధైర్యంగా పెంచింది ఎక్కడైనా మాట్లాడి ఏదైనా సాధించుకొచ్చేటంత  " అని చెప్పాడు."నేనేం ఏదీ కోరుకోలేదు నాకు ఏదైనా ఇవ్వమని దేవుణ్ణి అడగను నా పిల్లలు బాగుండాలి ఎంత సంపాయించావ్ నాన్న అని అడగను ఎంత ఖర్చు పెట్టుకున్నావ్ అని అడగను కాకపోతే  మంచి పేరు తెచ్చుకోవాలి అదొక్కటి చాలా ఆస్తులు ఉన్నంత" అని చెప్పింది రాకేష్ వాళ్ళ అమ్మ.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com