Home

»

Tv News

Podharillu :  కన్నా ప్రశ్నలకు మాధవ మౌనం.. ట్రిప్‌కు వెళ్లిన మహా టీమ్!

May 06, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -107 లో...... కన్నా మూడ్ డైవర్ట్ చెయ్యడానికి మహా తనని తన ఇష్టమైన ప్లేస్ కి తీసుకొని వెళ్తుంది. అక్కడ తన మనసు మారేలా మాట్లాడుతుంది. ఇద్దరు ఇంటికి వస్తారు. మాధవ కిచెన్ లో వంట చేసుకుంటూ.. వీళ్ళద్దరు ఇంకా ఇంటికి రాలేదనుకుంటాడు. ఆలోపే కన్నా హాల్లో మళ్ళీ డల్ గా కూర్చొని ఉంటాడు.

జరిగింది మర్చిపోమని చెప్పాను కదారా.. ఎందుకు గుర్తుచేసుకుంటన్నావని మాధవ అడుగుతాడు. మా అమ్మ నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళింది.. అందరు అన్నట్లు మా అమ్మని అయన పెళ్లి చేసుకోలేదా.. అమ్మలా చూసుకోమని నీ దగ్గర ఉంచి వెళ్లిందా అని కన్నా అడుగుతాడు. మాధవ వాటికి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. నువ్వు ఇంకొకసారి ఇంట్లో నుండి వెళ్ళిపోతే నా మీద ఒట్టే అని మాధవ అనగానే ఇంకెప్పుడు వెళ్ళను అన్నయ్య అంటాడు. ఆ తర్వాత మహా హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ నవ్వుకుంటుంది.‌అప్పుడే చక్రి వస్తాడు . సరదాగా బయటకు వెళదామా అని అడుగుతాడు. వెళదాం కానీ అందరం వెళదాం.. గాయత్రి బాధ నుండి పెద్ది బయటకు రావాలి.. కన్నా కూడా జరిగింది మార్చిపోవాలని మహా అంటుంది. దాంతో చక్రి ఒక్కొక్కరిగా అందరిని ట్రిప్ కి వెళ్ళడానికి ఒప్పిస్తాడు.

అందరు బ్యాగ్ తో బయటకు వస్తారు. అప్పుడే నారాయణ కార్ లో ఎంట్రీ ఇస్తాడు. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత అందరు బయల్దేరతారు. దారిలో అందరు చలువ కళ్ళద్దాలు(స్పెక్ట్స్) కొనుక్కొని సెల్ఫీ దిగుతారు. మహాకి దగ్గరగా చక్రి నిల్చొని ఫోటో దిగబోతుంటే మహా కోపంగా చూస్తుంది. తరువాయి భాగంలో  మహా వాళ్ళందరు రెసాట్ కి వెళ్తారు. అక్కడ భోజనం చేస్తారు. నారాయణ పక్కన వెళ్లి డ్రింక్ చేస్తాడు. అదే రెసాట్ లో మహా వాళ్ళ నాన్న ప్రతాప్ కూడా ఉంటాడు. నారాయణతో కలిసి డ్రింక్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com