Home

»

Tv News

Illu illalu pillalu : సాగర్ ఎగ్జిట్ ప్లాన్‌కు చెక్ పెట్టిన ధీరజ్.. నర్మదను కాపాడిన ఐదు లక్షల బాకీ!

May 06, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -463 లో.......అందరు రాత్రి భోజనం చేస్తారు. సాగర్ ని వేదవతి పిలుస్తుంది. సాగర్ మాత్రం రామరాజు అవమానించాడు అని కోపంగా ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి బ్యాగ్ తో హాల్లోకి వస్తాడు. అది చూసి అందరు షాక్ అవుతారు. ఏంటి నడిపోడా అని వేదవతి అడుగుతుంది. ఈ ఇంట్లో ఉండలేను అమ్మ దొంగదారిన జాబ్ తెచ్చుకున్నానని అందరి ముందు అవమానిస్తుంటే ఎలా ఉంటుందని సాగర్ అంటాడు.

రా నర్మద అని సాగర్ అంటాడు. సాగర్ ఏంటి చిన్నపిల్లాడిలాగా ప్రతిసారీ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటున్నావని నర్మద కోప్పడుతుంది. నువ్వు వస్తావా.. నన్ను వెళ్ళమంటావా అని సాగర్ కోప్పడతాడు. వెళ్ళరా.. ఏంటి బెదిరిస్తున్నావా రోజుకి నాలుగుసార్లు వెళ్తానంటావని ధీరజ్ అంటాడు. ఏంట్రా ఉండమనాల్సింది పోయి.. వెళ్ళమంటున్నావని వేదవతి అడుగుతుంది. నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నాన్నకి ఇవ్వాల్సిన అయిదు లక్షలు ఇచ్చేసి వెళ్ళు అని ధీరజ్ అంటాడు. ఇస్తానని సాగర్ అంటాడు. బయటకు వెళ్ళాక ఇవ్వనంటే పరిస్థితి ఏంటని రామరాజు అంటాడు. నువ్వు డబ్బు ఇస్తేనే వెళ్ళనిస్తానని అంటున్నాడని ధీరజ్ అంటాడు. సరే ఇచ్చేసి వెళ్తానని సాగర్ లోపలికి వెళ్తాడు. సారీ వదిన అన్నయ్యని ఆపడానికి డబ్బు అడిగానని నర్మదతో ధీరజ్ అంటాడు. నీకే థాంక్స్ చెప్పాలని నర్మద అంటుంది. నువ్వే ఈ కుటుంబం ముక్కలు కాకుండా ఆపుతావని ధీరజ్ తో వేదవతి అంటుంది.

మరొకవైపు వల్లి వాళ్ళ అమ్మకి వల్లి జరిగింది చెప్తుంది. అప్పుడే చందు వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి. ఇంట్లో విషయాలు మీ అమ్మకి చెప్పొద్దని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత సాగర్ తో నర్మద గొడవపడుతుంది. అదంతా రామరాజు వాళ్లు వింటారు. మరొకవైపు నర్మద ఎక్కడ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందోనని ప్రేమ డల్ గా ఉంటుంది. అదే విషయం ధీరజ్ తో చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com