.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -261 లో.... శకుంతల గుడికి రావడంతో సుధా అక్కడ నుండి వెళ్తుంది. శకుంతలతో కలిసి మళ్ళీ అర్చన చేయించడానికి వెళ్తారు. పక్క నుండి సుధా వెళ్లడం ఇషిక చూసి ఈవిడే కదా మావయ్య గారి చెల్లి అని ఇషిక అనుకుంటుంది. తనని ఫాలో అవ్వాలని సుధా వెళ్లే కార్ ని ఫాలో అవుతుంది ఇషిక. ఆ తర్వాత ఇషిక తన పక్కన లేకపోయేసరికి శకుంతల టెన్షన్ పడుతుంది. తనకి ఫ్రెండ్స్ ఎక్కువ కదా ఎవరైనా కలిశారేమోనని రుద్ర అంటాడు.
ఆ తర్వాత సుధా ఇంటికి వస్తుంది. తనకి ఎదురుగా లక్ష్మీ వస్తుంది. లక్ష్మీని చూసి ఇషిక షాక్ అవుతుంది. అంటే గంగ వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు పనిచేసేది మావయ్య గారి చెల్లెలు ఇంట్లోనా అంటే గంగ, రుద్రలకి అన్ని విషయాలు తెలిసాయా.. అందుకే ఇలా ఉన్నారా.. ఈవిడని కలవడానికి మావయ్య గుడికి వచ్చాడా అని ఇషిక అన్నీ ఆలోచిస్తుంది. ఆ తర్వాత అన్ని విషయాలు ఇంటికి వచ్చి వీరుకి చెప్తుంది. అంటే అత్తయ్యకి తెలియకుండా ఇదంతా చేస్తున్నారన్నమాట ఇప్పుడు మనం అత్తయ్యకి మరింత దగ్గర అవ్వొచ్చని వీరు అంటాడు. ఇప్పుడే వెళ్లి అత్తయ్యకు చెప్పు అని ఇషిక అనగానే ఇప్పుడే వద్దు టైమ్ వచ్చినప్పుడు చెప్పాలని వీరు అంటాడు.
ఆ తర్వాత సుధా ఇంటికి వచ్చి గుడిలో జరిగింది మొత్తం లక్ష్మీకి చెప్తుంది. అప్పుడే విశ్వ వస్తాడు. అతను డల్ గా ఉంటాడు. అమ్మగారు సరుకులు తీసుకొని వచ్చానని పైడిరాజు అంటాడు. ఎక్కడ తీసుకొని వచ్చారని సుధా అడుగుతుంది. మీరు ఎప్పుడు తీసుకొని వచ్చే దగ్గర అని పైడిరాజు అంటాడు. అంటే అన్నయ్య సూపర్ మార్కెట్ కి అయన వచ్చాడా అని సుధా అంటుంది. దాంతో అక్కడ జరిగింది మొత్తం పైడిరాజు చెప్తాడు. ప్రమీలకి సారీ చెప్పాడని చెప్తాడు. మాటలు అనేసి సారీ చెప్తే ఎలా అని విశ్వతో సుధా అంటుంది. మీ అన్నయ్య విషయంలో చేసింది తప్పేం కాదు కానీ అనవసరంగా తన కొడుకు గురించి తియ్యడం తప్పు అందుకే సారి చెప్పానని విశ్వ అంటాడు విశ్వ. ఇక అదే విషయం గురించి సుధా, విశ్వల మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత లక్ష్మీ, పైడిరాజు ఇద్దరు మాట్లాడుకుంటారు. గంగ తన మేనత్త కూతురు అని రుద్రకి చెప్పాలని ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత గంగ, రుద్ర ఇద్దరు శకుంతల, పెద్దసారు షష్టి పూర్తి చెయ్యాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
