
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి 13వ కంటెస్టెంట్ గా కమెడియన్, నటుడు కృష్ణుడు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, అదుర్స్, మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలతో అలరించిన కృష్ణుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇది తనకు కంబ్యాక్ కాదు.. స్టేట్మెంట్ అని AV లో ఎమోషనల్ గా చెప్పాడు. స్వీట్స్ అంటే తనకు ప్రాణమని, బిగ్ బాస్ కోసం వాటిని వదిలేస్తున్నానని చెప్పి నవ్వించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ గేమ్ కూడా ఆడగల కంటెస్టెంట్ గా కృష్ణుడు పై అంచనాలు ఉన్నాయి.
పద్నాలగవ కంటెస్టెంట్ గా నటి, టీవీ ప్రెజెంటర్ వర్షిణి సుందరరాజన్ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్ కి స్టెప్పులేస్తూ హౌస్ లోకి వెళ్లింది. పటాస్ 2 షోలతో ముద్దు ముద్దు మాటలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతోనూ గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా తన మాటతీరుతో ఆకట్టుకునే వర్షిణి హౌస్ లో ఎలా ఆడుతుందో చూడాలి. పదిహేనవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి చివరి కామనర్ గా రోహిత్ నాయుడు సెలెక్ట్ అయ్యాడు. ఇటీవల ఆటోలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయిన కామనర్ ఇతనే. ఆటో డ్రైవర్ లా వచ్చి స్టూడియోలో దిగిన వీడియో చూసి అందరు ఇతనే కామనర్ అని ఫిక్స్ అయ్యారు. జ్యూరీ మెంబర్ బిందు మాధవి అతన్ని స్టేజ్ మీదకు తీసుకొచ్చి రొమాంటిక్ యాంగిల్ ఉందని, ఆల్ రౌండర్ అని, హౌస్ లో రచ్చ చేస్తాడని పొగిడింది. కామనర్స్ లో రోహిత్ కి ఫస్ట్ నుండే మంచి హైప్, ఫ్యాన్ బేస్ వచ్చింది.
చివరి పదహారవ కంటెస్టెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ హౌస్ లోకి వెళ్లాడు. టాస్క్ లో 100 శాతం, ఫ్రెండ్షిప్ లో 75 శాతం, నామినేషన్స్ లో 50 శాతం, ప్రేమలో జీరో పర్సెంట్ కాన్ఫిడెంట్ అని ముఖేష్ చెప్పాడు. తన క్లారిటీతో ఆకట్టుకున్నాడు. ఇక అగ్నిపరీక్ష 2 ద్వారా 13 మంది కామనర్స్ లో ఆరుగురిని మాత్రమే సెలెక్ట్ చేసి, మిగిలిన ఏడుగురి జర్నీ ముగిసిందని నాగార్జున ప్రకటించారు. దీంతో పదహారు మందితో బిగ్ బాస్ 10 దశావతారం సీజన్ అధికారికంగా మొదలైంది.





