
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా టెంపర్ వంశీ వచ్చాడు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న టెంపర్ వంశీ..రియల్ లైఫ్ లో చాలా కూల్ అని తన AV లో చెప్పాడు. రీల్ లైఫ్ లో విలన్ గా చూశారని రియల్ లైఫ్ లో తనలోని మరో కోణాన్ని చూడబోతున్నారని అన్నాడు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని చెప్పిన వంశీ స్టేజ్ పై నాగార్జున, బాలకృష్ణ పాటలకు మాస్ డ్యాన్స్ చేసి అలరించాడు. బిగ్ బాస్ హౌస్ లో విలనిజం చూపిస్తాడా లేక ఫ్రెండ్లీగా ఉంటాడా అనేది ఇంట్రెస్టింగ్ మారింది.
ఆ తర్వాత పదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ఫైనలిస్ట్ శ్రష్టి వ్యాకరణంను యాంకర్ శ్రీముఖి తన ఛాయిస్ గా సెలెక్ట్ చేసింది. శ్రష్టిని చూస్తే సీజన్-3లో తనను చూసినట్లే ఉందని శ్రీముఖి ఎమోషనల్ అయింది. అగ్నిపరీక్షలో శ్రష్టి గేమ్, ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ అన్నీ బాగా నచ్చాయని చెప్పింది. తన తరపున నాగార్జునకు ప్రతీవారం ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వమని శ్రష్టిని కోరింది శ్రీముఖి.. శ్రష్టి ఫస్ట్ నుండే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తోంది.
పదకొండవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ కమెడియన్ నరేష్ వచ్చాడు. అతను 'పంజా' సినిమాలోని 'భూమికి జానెడు' పాటకు డ్యాన్స్ చేస్తూ మాస్ గా వచ్చాడు. రామ్ ప్రసాద్ తర్వాత మరో జబర్దస్త్ కమెడియన్ కావడంతో హౌస్ లో కామెడీకి ఢోకా లేదని అర్థమవుతోంది.ఇక పన్నెండవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్షలో మెరిసిన ఆర్జే చరణ్ మహాదేవ్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వచ్చాడు. బిగ్ బాస్ హిస్టరీలో మోస్ట్ నాన్ సీరియస్ కంటెస్టెంట్ తనే అని చెప్పుకున్నాడు. అతనికి గోల్డ్ మెడల్ వేసి హౌస్ లోకి పంపించారు నాగార్జున.
ఈ ముగ్గురు అంటే నరేష్, శ్రష్టి, చరణ్ మధ్య స్పెషల్ పవర్స్ కోసం రింగా రింగా టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో చరణ్ మహాదేవ్, శష్టి డిస్కస్ చేసి నరేష్ ని తక్కువ అంచనా వేశారు. కమెడియన్ ఏం చేస్తాడులే అనుకున్నారు. కానీ చివరకు నరేష్, శ్రష్టి మ్యాజిక్ కీలు గెలుచుకున్నారు. ఈ గేమ్ అయ్యాక నరేష్ ని తక్కువ అంచనా వేశావని చరణ్ తో నాగార్జున అన్నారు. ఈ టాస్క్ తో నరేష్ కమెడీయన్ మాత్రమే కాదు.. టాస్కుల్లో కూడా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆరుగురుకి ఆరు 'కీ' లు వచ్చాయి.






