
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu .ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 58 లో.. అక్క రేపు కాలేజీలో ప్రోగ్రాం ఉంది, అందరం గోరింటాకు పెట్టుకుని రావాలని భవితతో కృష్ణ అంటుంది. కోన్ తెచ్చుకో పెడతానని భవిత అనగా.. కోన్ లో కెమికల్ ఉంటుంది అక్క అని కృష్ణ అంటుంది. అప్పుడే గీత వచ్చి.. కృష్ణ చెప్పింది కరెక్ట్, మనకి గోరింటాకు చెట్టు ఉంది కదా ఆకులు తెంపి తీసుకురండి నేను పెడతానని చెప్తుంది. నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఇద్దరు అక్కాచెల్లెళ్లు గొడవపడుతుంటే ప్రీతి వెళ్తుంది. ఆగు ప్రీతి నేను వెళ్తానని చెప్పి అంజలి గోరింటాకు కోసుకొచ్చి ఇస్తుంది. గీత రోటితో రుబ్బి కూతుళ్లకు పెడుతుంది..ఆఫీస్ నుంచి ఫోన్ రాగా సోఫాలో మాట్లాడుతూనే నిద్రపోతుంది.
హాల్ లో నిద్రపోతున్న గీతను చూసిన అంజలి ఎమోషనల్ అవుతూ తల్లి చేతిని పట్టుకుని తనే గోరింటాకు పెడుతుంది. ఆ తర్వాత భవిత గోరింటాకు పెట్టుకుని ఉండగా ఫ్రెండ్ ఫోన్ చేసి.. పార్టీ ఉంది కదా మర్చిపోయావా అనగానే గోరింటాకు కడుక్కుని త్వరగా రెడీ అయి ఇంట్లో ఎవరూ చూడకుండా గోడ దూకి వెళ్లిపోతుంది. అమ్మకు తెలిస్తే బాధపడుతుందని అంజలి అనుకుంటుంది. మరోవైపు చిన్నిని దత్తత తీసుకున్న వాళ్లు రేవతి దగ్గరికి తీసుకురాగా.. మనలాగే అంజలి అక్కకు కూడా మంచి పేరెంట్స్ దొరికి ఉంటారు.. పెద్ద ఇంట్లో ఉంటుందని చిన్ని అంటుంది.
తరువాయి భాగంలో రాకీ సిగరెట్ కాలుస్తుండగా అలారం మోగుతుంది. బావా ఇది నో స్మోకింగ్ ఏరియా అని గీత కొడుకు అంటాడు. అందరూ రాగానే.. ఇక్కడ ఎవరు సిగరెట్ కాల్చిందని గీత అడుగుతుంది. రాకీ తన బామ్మర్ది పేరు చెప్పడంతో గీత కొడుకుని కొడుతుంది. ఆగండి అమ్మగారు అని అంజలి అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






