Home

»

Tv News

Bigg Boss Winner Nikhil Ex Lover Kavya బిగ్ బాస్ సీజన్ 10 కి కావ్యశ్రీ ఎంట్రీ

Aug 25, 2026 10:23AM

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విజేత నిఖిల్ మలయక్కల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ సీజన్ లో విన్నర్ గా 55 లక్షలు కొట్టేశాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే కొద్ది రోజుల ముందే తన 5 ఏళ్ల రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశాడు. ఆ అమ్మాయే కావ్య శ్రీ. ఇద్దరు గోరింటాకు సీరియల్ లో హీరో హీరోయిన్స్ గా చేసి లవ్ లో పడ్డారు. యూట్యూబ్ ఛానల్ కూడా కలిసి నడిపారు.

 

నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళాక కావ్యశ్రీ సైలెంట్ గా లేదు. చాలా ఇంటర్వ్యూలలో.. నమ్మి మోసపోయాను, గుడ్డిగా నమ్మడం నా లైఫ్ లో చేసిన పెద్ద తప్పు అని చెప్పింది. దీంతో నిఖిల్ కావ్య బ్రేకప్ కి బిట్రేయల్ కారణమని అందరు అనుకున్నారు. ఆ టైంలో ఆమె చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ సీజన్-10 కి తను రాబోతుందని సమాచారం. ఇక ఈ బిగ్ బాస్ సీజన్-10 సెప్టెంబర్ 1, 2026 నుంచి నాగార్జున హోస్ట్ గా స్టార్ట్ కాబోతుంది. ఈసారి రెండు హౌస్ లు, సెలబ్రిటీస్ ఒక హౌస్, అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ ఒక హౌస్ లో ఉంటారని మళ్ళీ కొత్త ఫార్మాట్ అని తెలుస్తోంది. అయితే సెలబ్రిటీ లిస్ట్ లో ఇప్పుడు హాట్ గా వినిపిస్తున్న పేరు కావ్య శ్రీ.

 

మేకర్స్ దీన్ని చాలా క్యాలిక్యులేటెడ్ గా ప్లాన్ చేశారని టాక్. ఎందుకంటే కావ్య వస్తే నిఖిల్ టాపిక్ కచ్చితంగా వస్తుంది. ఆమె నోటి నుంచి బ్రేకప్ స్టోరీ బయటకు వస్తుంది. దానికి తోడు రీసెంట్ గా ఆహాలో జరిగిన సర్కార్-5 షోలో సుడిగాలి సుధీర్ తో చేసిన రీల్ కూడా బాగా వైరల్ అయింది. గ్లామర్ క్వీన్ గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందుకే TRP కోసం కావ్యని తీసుకుంటున్నారని సమాచారం. అయితే ఇప్పటివరకు అఫీషియల్ గా మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. లీక్డ్ లిస్ట్ లో పేరు ఉంది కానీ కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ కావ్య నిజంగా బిగ్ బాస్  కి వెళ్తే.. తన మాజీ లవర్ నిఖిల్ గురించి చెప్తుందా లేదా అనేది అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com