Home

»

Tv News

Agnipariksha Season 2: ఆర్మ్ రెజ్లింగ్ నుంచి తాడు టాస్క్ వరకు - రోహిత్, శ్రుష్టి హైలైట్!

Aug 25, 2026 10:20AM

బిగ్ బాస్ సీజన్ 10 కోసం అగ్నిపరీక్ష మొదలైంది. అగ్నిపరీక్ష నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం. ముందుగా బాయ్స్ కి ఆర్మ్ రెజ్లింగ్ పెట్టారు. రోహిత్ వర్సెస్ మిథిలేష్ తలపడితే రోహిత్ చాలా ఈజీగా లాగి పడేశాడు. మిథిలేష్ అంత తొందరగా ఓడిపోవడంతో యాంకర్ శ్రీముఖి కూడా.. ఏంటి ఇలా ఓడిపోయావని షాక్ అయింది. దీంతో రోహిత్ ఫిజికల్ గా స్ట్రాంగ్ అని మొదటి నుంచే ప్రూవ్ అయింది.

 

ఆ తర్వాత లేడీస్ లో కూడా సేమ్ ఆర్మ్ రెజ్లింగ్ పెట్టారు. శ్రష్టి వర్సెస్ అపూర్వ. ఇందులో శ్రష్టి పవర్ చూపించి గెలిచింది. అంటే బాయ్స్ లో రోహిత్, గర్ల్స్ లో శ్రష్టి ఇద్దరూ మొదటి టాస్క్ లోనే హైలైట్ అయిపోయారు. ఆ తర్వాత బాయ్స్ అందరితో, లేడీస్ అందరితో విడివిడిగా మ్యూజికల్ చైర్ ఆడించారు. ఇది చూడటానికి సింపుల్ గా ఉన్నా, అందులో గెలవడం చాలా కష్టం. ఎవరు ఫాస్ట్ గా కూర్చుంటే వాళ్లే సేఫ్ అన్నట్టుగా నడిచింది. ఈ గేమ్ వల్లే ఎవరు ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలిసిపోయింది.

 

ఇక మెయిన్ టాస్క్ లో గాయత్రికి ఎల్లో కార్డ్ ఇచ్చాక కూడా ఒక పవర్ ఇచ్చారు. రెండు టీమ్స్ కి లీడర్లను తనే సెలెక్ట్ చేయాలని చెప్పారు. దీంతో తను స్ట్రాంగ్ టీంకి రోహిత్ ని, వీక్ టీంకి దీపక్ ని లీడర్ గా పెట్టింది. ఎల్లో కార్డ్ వచ్చిన లీడర్ ని డిసైడ్ చేసే ఛాన్స్ రావడం అందరికి షాకింగ్ గా అనిపించింది. లాస్ట్ లో జరిగిన తాడు టాస్క్ లో అసలు రచ్చ జరిగింది. తాడుని చేత్తో పట్టుకోవద్దని జ్యూరీ ముందే చెప్పినా రోహిత్ వినకుండా ఒక్కసారిగా లాగేసి అందరిని కింద పడేశాడు. మధ్యలో శ్రష్టికి దొరికిన కీ కూడా మిస్ అయింది. దీంతో ఆటను మధ్యలో ఆపి మళ్ళీ రూల్స్ చెప్పి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. చివరికి రూల్ బ్రేక్ చేసినందుకు రోహిత్ కి ఎల్లో కార్డ్ ఇచ్చారు, బాగా ఆడినందుకు శ్రష్టికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చి ఓట్ అప్పీల్ కి పంపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com