TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Karthika Deepam2: సూరజ్ వాళ్ళింటికి శివన్నారాయణ ఫ్యామిలీ.. అవమానించిన మాలిని!

Nov 27, 2026 10:04AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం2 (Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 840 లో.....  సూరజ్ ని చూడటానికి జ్యోత్స్న వెళ్తానంటే మాలిని వద్దంటుంది. అది నేను కాపాడిన ప్రాణం నాకే సొంతమని జ్యోత్స్న వెళ్తుంది. ఇంట్లో మాలినిని కార్తీక్, దీప నిలదీస్తారు. జ్యోత్స్నని చంపాలని ప్లాన్ చేసింది నువ్వే కదా అని కార్తీక్ అడుగుతాడు. పోలీస్ ఆదిత్య చెప్పాడని, కేసు ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ గా మారిందని వార్నింగ్ ఇస్తాడు.

 

మరోవైపు సూరజ్ దగ్గరకు జ్యోత్స్న వెళ్లి.. నా ప్రేమ అబద్ధం కాదు, నా మనసు బజారులో వస్తువు కాదని ఎమోషనల్ గా చెప్తుంది. సూరజ్ కళ్లల్లో నీళ్ళు వస్తాయి. జ్యోత్స్న అతని కళ్లద్దాలు తుడిచి.. మరక అవతల వాళ్ల ఒంటి మీద కాదు, మన కంటి మీద ఉండొచ్చని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత.. నా మనవడు కళ్లు తెరిచిన తర్వాతే బతికినట్లు అయింది, నీ కోడలికి ఎవరి ఉసురుపోసుకోవద్దని చెప్పమని దక్షిణామూర్తితో శివన్నారాయణ, దశరథ్ వాళ్లు మాట్లాడతారు.

 

ఇంట్లో పారిజాతం ప్రేమ లేదని చెప్పు అంటే జ్యోత్స్న.. నాకు సూరజ్ మీద ప్రేమ ఉంది, మీరే ప్రేమించేలా చేశారు, మాలిని అత్త జాబ్ చేయనివ్వలేదు, అందుకే దక్షిణామూర్తి తాత సాయంతో అక్కడే జాయిన్ అయ్యాను, నేను బతికున్నానంటే సూరజ్ నే కారణమని చెప్తుంది.

 

ఫైనల్ గా మాలిని ఇంటికి శివన్నారాయణ ఫ్యామిలీ వెళ్తుంది. ఉన్నాడో పోయాడో చూడటానికి వచ్చారా అని మాలిని అవమానించి, తెచ్చిన ఫ్రూట్స్ ని పనిమనిషికి ఇచ్చి నువ్వు తిను, మిగిలితే పనివాళ్లకి ఇచ్చేయ్ అని పనిమనుషులతో పోల్చుతుంది. సూరజ్ కోసం జ్యోత్స్న వెతుకుతుండగా మేడ మీద నుంచి సూరజ్ కనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img