Bigg Boss 10 Telugu: కెప్టెన్సీ కంటెండర్ రేస్ లోకి దేబ్జానీ.. ముఖేష్‌పై త్రిగుణ్ ఫైర్!
Nov 26, 2026 8:24AM
.webp)
బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం బడ్డీ అప్ థీమ్ సాగుతోంది. ఇందులో భాగంగా మాజీ కంటెస్టెంట్లు ఇంట్లోకి వస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్ లో రీతూ, డీమాన్ పవన్, టేస్టీ తేజ, శోభాశెట్టి హౌస్ లోకి వచ్చారు. మొదటి టాస్కులో డీమాన్ పవన్ ఆడి దేబ్జానీని గెలిపించాడు. దేబ్జానీ గెలిచి చివరి కెప్టెన్సీ కంటెండర్ రేసులో నిలిచింది. ఆల్రెడీ మొన్నటి టాస్కులో ఆర్కే, శివ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికి నలుగురు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు.
ఇంట్లోకి డీమాన్ పవన్, రీతూ వచ్చారు. కానీ ఈ ఇద్దరి మధ్య ఏదో తెలియని గ్యాప్ ఉన్నట్టుగా కనిపించింది. ఒకప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టుగా బిహేవ్ చేయలేదు. ఇద్దరూ కలిసి ఎక్కువగా మాట్లాడుకున్నది కూడా లేదు. అయితే వీరు పెట్టిన డ్యాన్స్ టాస్క్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ముకేష్ రీతూ, దేబ్జానీ డీమాన్ పవన్ కలిసి ఆడిన ఆట మాత్రం రసవత్తరంగా అనిపించింది. ఈ టాస్కులో సంచాలక్‌గా త్రిగుణ్ తన మార్క్‌ని చూపించాడు. రూల్స్ మీరి ఆడిన ముఖేష్‌ని త్రిగుణ్ అడ్డగించాడు. స్విమ్మింగ్ పూల్‌లో బాల్స్ విసిరేయడం, బాస్కెట్‌ని కిందకు లాగి మరీ అందులోంచి బాల్స్ తీయడం ఇవన్నీ ఫౌల్స్ అని గట్టిగా వాదించాడు.ఈ టాస్కులో పవన్ ఆడిన తీరుకి అతని టీ షర్ట్ కూడా చినిగిపోయింది. ముఖేష్, పవన్ ఇద్దరు పోటాపోటీగా ఆడారు.
మరో వైపు రీతూ, దేబ్జానీ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఆడారు. ఈ టాస్కులో చివరకు దేబ్జానీ, డీమాన్ పవన్ గెలిచినట్టుగా సంఛాలక్ త్రిగుణ్ చెప్పాడు. అయితే ఓ టాస్క్ లో త్రిగుణ్ వర్సెస్ ముఖేష్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అయితే సంఛాలక్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి ముఖేష్ ఏం చేయలేకపోయాడు.



.webp)