Brahmamudi: ఆ కొరియర్ చూసి అపర్ణ షాక్.. హోమానికి రాజుని ఇందు ఒప్పించగలదా!
Nov 27, 2026 10:09AM
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 1199 లో.....అపర్ణకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొరియర్ వస్తుంది.. ఆ కొరియర్ ఓపెన్ చేసి చూడగా అందులో రాజ్ చిన్నప్పుడు దిగిన ఫొటోలు ఉంటాయి. వాటిని చూడగానే అపర్ణ షాక్ అవుతుంది. ఈ ఫొటోలు తీశారంటే రాజ్ ఈ ఇంటి వారసుడని ఎవరికో తెలుసు, వాడిని ఎవరో ఫాలో అవుతున్నారని ముచ్చెమటలు పడుతుంది. ఈ విషయాన్ని చూసిన భ్రమరాంబ.. మీకు కొరియర్ పంపేవాళ్లు ఎవరు? మీ పిల్లలు కూడా బతికిలేరు, మనవరాలు ఇంట్లోనే ఉందని ప్రశ్నిస్తుంది. దాంతో అపర్ణ.. పక్కవాళ్ల కొరియర్ చూడకూడదనే జ్ఞానం లేదా అని సీరియస్ గా వెళ్లిపోతుంది.
లోపలికి వచ్చి కంగారుగా మంచినీళ్లు తాగడంతో సుభాష్ కంగారుపడతాడు. కొరియర్ లోని ఫొటోలు చూసిన అతను కూడా ఉలిక్కిపడతాడు. రాజ్ గురించి బాగా తెలిసిన వాళ్లే ఇలా చేస్తున్నారని అంటుంది అపర్ణ. అప్పట్లో రుద్రాణి, ఇప్పుడు రేఖ తప్ప మనకి అన్యాయం చేసేవాళ్లు ఎవరు లేరని అంటాడు సుభాష్. 20 ఏళ్ల తర్వాత మన దగ్గరికి వచ్చిన మన మనవడిని ప్రాణాలు అడ్డుపెట్టయినా కాపాడుకోవాలని అపర్ణ అంటుంది. ఇందూకి ఇప్పుడే చెప్తే కంగారుపడుతుందని మొదట ఆలోచిస్తారు, కానీ తర్వాత ఇందూని పిలిచి నిజం చెప్పేద్దామని నిర్ణయిస్తారు.
భోజనాల దగ్గర అపర్ణ అదోలా ఉండటంతో భ్రమరాంబ "మీ నానమ్మ మనసు కొరియర్ దగ్గరే ఉంది, అది వచ్చినప్పటి నుంచి వణికిపోతున్నారని చెప్తుంది. దాంతో రేఖ.. ఆ కొరియర్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా అపర్ణ సైలెంట్ అయిపోతుంది. మనిల్లు కాదు, మా ఇల్లు.. మా ఇంట్లోకి చాపకింద నీరులా వచ్చి మాది అంటే ఊరుకోనని అపర్ణ సీరియస్ అవుతుంది. నా పుట్టింటి వాళ్లు, స్నేహితులు పంపించి ఉంటారని కవర్ చేస్తుంది. దీంతో రేఖకి అనుమానం వస్తుంది. ఆ తర్వాత భ్రమరాంబ రేఖతో.. ఆ అపర్ణ సైలెంట్ కిల్లర్, ఆ కొరియర్ లో పెద్ద రహస్యం దాగి ఉందని అంటుంది.
ఇందూ వచ్చి ఎందుకు నిజం దాస్తున్నావని ప్రశ్నించడంతో అపర్ణ.. రాజ్ నీ మెడలో తాళి కట్టిన ముహూర్తం బాలేదని గురువుగారు చెప్పారు, రాజ్ ని మృత్యువు వెంటాడుతోంది, కార్తీక మాసంలో మృత్యుంజయ హోమం చేయించాలని చెప్తుంది. ఇందూ షాక్ అయినా.. నేను బావని ఒప్పిస్తానని మాట ఇస్తుంది. ఆఫీసులో టెండర్ లీక్ చేసింది డిజైనర్ ప్రశాంత్ అని, తల్లి ఆపరేషన్ కోసం రఘువీర్ కి అమ్ముడుపోయాడని తెలియడంతో రాజ్-ఇందూ హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు కడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




