(5).webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 1144 లో... రేఖ ఆస్తిని తన పేరు మీదకు మార్పించుకునేందుకు పెద్ద ప్లానే వేస్తుంది. సిరిని రాజు ఇంట్లో పెట్టడంతో తనే మొదటి భార్య, ఇందు రెండో భార్య అని లాయర్ ని పిలిపిస్తుంది. చట్టప్రకారం ఇందు, రాజుల పెళ్లి చెల్లదని, పవర్ ఆఫ్ అటార్నీ మళ్లీ రేఖకే వస్తుందని లాయర్ చెప్పి సంతకం పెట్టమని ఇందును బలవంతం చేస్తుండగా రాజు ఎంట్రీ ఇస్తాడు. హాల్ టికెట్ ని పడవ చేసిన సిరి దాన్ని తిరిగి ఇవ్వగా ఐశు షాక్ అయి కొట్టబోతుంది. రాజు, ఇందు అడ్డుకుని.. తను చిన్నపిల్లలా ఉంటుందని తెలిసి కూడా జాగ్రత్తగా పెట్టుకోకుండా నింద వేస్తావా అని ఐశుని నిలదీస్తారు. పడవచూసి భయపడిన సిరి ఏడవడంతో ఇందు పాయసం పేరుతో బుజ్జగిస్తుంది.
కిచెన్ లో ఇందు, రాజుల మధ్య ఎమోషనల్ సీన్ జరుగుతుంది. సిరిని ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశానేమో.. రేఖ పిన్ని నుంచి ఐశు వరకు అందరు ఇరికించాలని చూస్తున్నారు. నానమ్మ కూడా ఇబ్బంది పడుతోందని రాజు బాధపడతాడు. దానికి ఇందు.. సిరి నీ దగ్గర మాత్రమే సేఫ్ గా ఉంటుంది. హాస్టల్ లో, రీహాబ్ సెంటర్ లో ఉంచగలవా.. దేవుడు నీకు ఇచ్చిన రెండో అవకాశంతో సిరికి రెండో జీవితం ఇవ్వాలని ఆలోచించమని ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత హాల్లోకి లాయర్ రాగానే.. రాజు, సిరిల పెళ్లికి సాక్ష్యం ఉందా? మ్యారేజ్ సర్టిఫికేట్, ఫోటోలు, వీడియోలు, ఆధార్ లో భర్త పేరు ఏదైనా ఉందా అని రాజు ఎదురు ప్రశ్నిస్తాడు. హాస్పిటల్ లో భర్తగా పెట్టిన సంతకం సాక్ష్యం కాదని.. కోర్టులో.. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టానని అంటాడు. కేసు నిలబడదని లాయర్ చెప్పడంతో రేఖ ప్లాన్ బోల్తా పడుతుంది.
సిరి సాక్ష్యం చెప్తుందని భ్రమరం అనగానే.. సిరికి గతం గుర్తులేదు.. ఆరేళ్ల పిల్లలా ప్రవర్తిస్తోంది.. డాక్టర్ సర్టిఫికేట్ వచ్చే వరకు తన సాక్ష్యం కోర్టు అంగీకరించదని లాయర్ తేల్చేస్తాడు. దీంతో లాయర్ వెళ్లిపోతాడు. ఫీజు అత్త ఇస్తుందని రాజు ఎద్దేవాగా అంటాడు. పైకి వెళ్లిన రేఖతో.. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆస్తి నీకు దక్కనివ్వను.. నా వాళ్ల జోలికి వస్తే ఊరుకోనని రాజు వార్నింగ్ ఇస్తాడు. తరువాయి భాగంలో రేఖ వాళ్ళు సిరితల్లిదండ్రులను వెతకాలని ప్లాన్ చేస్తుండగా ఇందు కూడా.. ఆరోజు యాక్సిడెంట్ చేసిన బండి నంబర్ తో సిరి వివరాలు తెలుసుకోవచ్చని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Brahmamudi, Brahmamudi Episode 1144, Star Maa Serial, Raju, Indu, Siri, Rekha, Bhramaramba, Aishwarya, Power of Attorney]






