TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Karthika Deepam2: నిశ్చితార్థం వద్దన్న సూరజ్.. కంటతడి పెట్టిన జ్యోత్స్న ఎమోషనల్ సీన్!

Aug 22, 2026 9:32AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  కార్తీక దీపం2 . ఈ సీరియల్  శుక్రవారం నాటి ఎపిసోడ్  755లో.. సూరజ్ చేతులు పట్టుకుని కన్నీళ్లతో మాట్లాడింది జ్యోత్స్న. ఇన్నాళ్లు నువ్వు పెట్టిన పరీక్షలు చాలు. ఇది జన్మంతా నాతో ఉండాలని కోరుకునే ప్రేమ అని జ్యోత్స్న చెప్పింది. దానికి సూరజ్ .. నువ్వు ఇక్కడ ప్రేమ కథలు చెప్తుంటే అక్కడ మీవాళ్లు వెయిట్ చేస్తున్నారు. నీ పెళ్లి అనగానే దశరథ గారి కంటే దాసు గారే ఎక్కువ సంతోషంగా ఉన్నారెందుకని సూరజ్ ప్రశ్నిస్తాడు. ఆయనకు నేను మేనకోడలిని కాబట్టి అని జ్యోత్స్న సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది.

 

మరోవైపు దీప, కార్తీక్ తో దశరథ్ మాట్లాడుతుంటాడు. మీ వల్లే జ్యోత్స్న మారింది. కన్నకూతురు కాదని తెలిసినా ఇప్పుడు నేను కోరుకున్న కూతురిలా అయ్యిందని అంటాడు. అప్పుడు కార్తీక్ .. ఇదంతా సూరజ్, దీప క్రెడిట్ మామయ్యా అని అంటాడు. జ్యోత్స్న నీకు మంచి కూతురైన తర్వాత నా అవసరం లేదేమో నాన్నా అని దీప అనగానే దశరథ కంటతడి పెడుతూ.. అలా అనకు తల్లి.. రేపు సుమిత్రతో.. మన కన్నకూతురు దీపే చిన్నకూతుర్ని మనిషిగా మార్చిందని గర్వంగా చెప్తానని అంటాడు.

 

శివన్నారాయణ నిశ్చితార్థం గురించి అడిగితే సూరజ్ అందరికి షాకిస్తాడు. ఎంగేజ్‌మెంట్ వద్దు సర్. డైరెక్ట్ గా ఈ రోజే పంతుల్ని పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టేయండి వదినా అని దీపతో అంటాడు. దీంతో దీప, కార్తీక్ వెంటనే పంతులికి ఫోన్ చేస్తారు. సూరజ్ కూడా సరేనని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. చివర్లో జ్యోత్స్న ఆనందంతో లవ్ సింబల్ ఉన్న గోల్డ్ చైన్ ను సూరజ్ మెడలో వేసి.. ఈ ప్రేమ కానుక నీ కోసమే సూరజ్ అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img