
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 185 లో.. ఇంట్లో గొడవలు ఎక్కువైన తర్వాత తాయారు అందరిని ఆపి ఒక పెద్ద నిజం చెప్తుంది. దుర్గా ప్రసాద్ పరాయి వ్యక్తి కాదు, అతను నారాయణకు సొంత తమ్ముడు. అంటే చక్రికి దుర్గా ప్రసాద్ పెద్దనాన్న అవుతాడు. ఇన్నాళ్లు ఈ విషయం ఎవరికి తెలియకుండా దాచారు. ఈ మాట విన్న వెంటనే ఇంట్లో అందరు షాక్ అవుతారు. మహా, చక్రి కూడా ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉంటారు.
రక్తసంబంధం తెలిసినా దుర్గా ప్రసాద్ కోపం తగ్గదు. ఇన్నాళ్లు నా హక్కులను మీరు లాక్కున్నారంటూ నారాయణ మీదకు కత్తితో వెళ్తాడు. తమ్ముడు ఆపు అని నారాయణ ఎంత చెప్పినా అతను వినడు. పరిస్థితి చేజారిపోతుందని అర్థమైన చక్రి వెంటనే తన తండ్రిని కాపాడటానికి అడ్డుగా వెళ్తాడు. అదే సమయంలో దుర్గా ప్రసాద్ వేసిన దెబ్బ నేరుగా చక్రికి తగులుతుంది.
చక్రికి దెబ్బ తగలగానే రక్తం చిమ్ముతుంది."చక్రి" అంటూ మహా కేకలు వేస్తుంది. గాయత్రి, నారాయణ, తాయారు అందరు భయపడిపోతారు. దుర్గాప్రసాద్ కూడా తను చేసిన పనికి కంగారుపడతాడు. నేను కావాలని చేయలేదని అంటాడు. వెంటనే చక్రిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తారు. నా కొడుకు కోసం నా తమ్ముడే ఇలా చేశాడా అని నారాయణ బాధపడతాడు. చక్రిని ఒడిలో పెట్టుకుని మహా.. నీకు ఏమీ కాదు, కళ్లు తెరువు అని ఏడుస్తుంది. ఇంట్లో అందరు టెన్షన్‌గా ఉంటారు. దుర్గాప్రసాద్ చేసిన తప్పుకు పశ్చాత్తాప్పడతాడు. ముందు చక్రిని కాపాడుకుందాం, తర్వాత అన్ని మాట్లాడుకుందామని తాయారు చెప్తుంది. చక్రి ప్రాణాలకు ఏమవుతుందోనని అందరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

