.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 353 లో.....ఆషాడం లో గోరింటాకు పెట్టుకోవాలని సుధా, పెద్దసారు అందరు అనుకుంటారు. అందుకోసం గోరింటాకు దొంగతనానికి రంగా గంగ వెళ్తారు. అక్కడికి రుద్ర కూడా వెళ్లి గంగపై కోప్పడుతాడు. మరొకవైపు జయ, వీరు , ఇషిక పక్కకి వచ్చి మాట్లాడుకుంటారు. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగాలని ముగ్గురు అనుకుంటారు. అప్పుడే రామనాథం రావడం ఇషిక వాళ్ళు గమనించి టెన్షన్ పడుతారు.
అతను రాగానే అతన్ని వీరు కర్రతో కొడతాడు. దాంతో అతను కిందపడతాడు. ఎవరు చూడకుండా అతన్ని లోపలోకి తీసుకొని వెళ్లి స్టోర్ రూమ్ లో కిడ్నాప్ చేసి తాళ్లతో బంధిస్తాడు వీరు. ఆ తర్వాత ఏం తెలియనట్లుగా మళ్ళీ లోపలికి వస్తాడు. ఎక్కడికి వెళ్లారు మీ ముగ్గురు అని ఇందుమతి అడుగుతుంది. ఎక్కడికి లేదు అని కవర్ చేస్తాడు వీరు. జయకి బయట చూపించానని ఇషిక చెప్తుంది.
ఆ తర్వాత అందరు సరదాగా మాట్లాడుకుంటారు. అది చూసి ఎంత కాలం అయింది వదిన మనం ఇలా మాట్లాడుకొని అని సుధా ఎమోషనల్ అవుతుంది. దాంతో శకుంతల ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది. అది సుధాకి అర్ధం అయ్యేలోపు మళ్ళీ కవర్ చేస్తుంది శకుంతల. గంగని రుద్ర సైకిల్ పై తీసుకొని ఇంటికి వస్తాడు. అక్కడ బయట ఒక కర్రని చూసి షాక్ అవుతాడు రుద్ర. గంగ లోపలకి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళారని పెద్దసారు అడుగుతాడు. దొంగతనానికి అని రుద్ర చెప్తాడు. అంటే గోరింటాకు కోసమని గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
