TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Brahmamudi: రేఖ ప్లాన్ ఫెయిల్.. షాక్ లో రేఖ, భ్రమరాంబ!

Nov 24, 2026 9:09AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1196....లో రాజు, ఇందులకు శోభనం జరుగుతుంటే రఘువీర్ తో కలిసి ఇంటికి వెళ్తుంది. రాజు, ఇందు ఎలా తనతో ప్రవర్తిస్తుందోనని భయపడుతుంటే శేషు ధైర్యం చెప్తాడు.‌ ఇలాంటి సందర్భంలోనే మన మగజాతి తరతరాలుగా బెండ్ అయిపోతుందని, నువ్వన్నా రేపు పొద్దున్న మగజాతి అణిముత్యంలా ఆ రూంలోంచి బయటకు వస్తావని ఆశిస్తున్నాన్ను అల్లుడు అంటూ చెప్పగానే తప్పకుండా మన జాతి గౌరవాన్ని నిలబెడతాను మామయ్య అంటాడు రాజు. ఏమో అల్లుడు అందరూ ఇలాగే ముందు మాటలు చెప్తారు కానీ రూంలోకి వెళ్లాక అమ్మాయి నవ్వుకో ప్రేమకో బానిసలుగా మారిపోతారు. తర్వాత నాలాగా శేషు అంటే మూశామనే పరిస్థితికి దిగజారిపోతారంటాడు శేషు. రాజు మాత్రం అలా ఏం జరగదని చెప్తాడు.

రాజు, ఇందులను శోభనం గదిలోనే చంపేయాలని రేఖ ప్లాన్ చేస్తుంది. అందుకోసం సన్నటి వైర్ తీసుకుని భ్రమరాంబతో కలిసి శోభనం జరిగే రూంలోకి వెళ్లి బెడ్ మీద పూలల్లో కలిసిపోయేలా వైర్ సెట్ చేసి కరెంట్ కనెక్షన్ ఇస్తుంది, రాజు, ఇందు వచ్చి ఆ బెడ్ మీద పడుకోగానే కరెంట్ షాక్ తగిలి చనిపోయేలా రెడీ చేస్తుంది. భ్రమరాంబ ఆ వైర్ పనిచేస్తుంది అంటావా రేఖ అని అడిగితే ఫ్రీగా నీ మీద ట్రై చేద్దామా, వెళ్లి బెడ్ మీద కూర్చో అంటుంది రేఖ, వద్దులే రేఖ అంటూ భ్రమరాంబ బయటకు పరుగుపెడుతుంది. మరోవైపు ఆఫీసు నుంచి ఐశ్వర్యను ఇంటికి తీసుకొస్తాడు రఘువీర్.  రఘువీర్ కారు చూసిన ఐశ్వర్య చాలా బాగుందని అంటుంది. రెండేళ్లల్లో ఇలాంటివి నీ ఇంటి ముందు పది ఉండాలి అంటాడు. లక్కీ అంతా పై నుంచి గమనిస్తుంటాడు. ఐశ్వర్య, రఘువీర్ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ క్లోజ్ గా ఉండటం చూసి షాక్ అవుతాడు. ఐశ్వర్య రూంలోకి వెళ్లగానే లక్కీ నిలదీస్తే నువ్వు ఎక్కువ చేస్తే కట్ చేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది.

రాజును శోభనం రూంలోకి శేషు తీసుకెళ్లి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. రూంలోకి వెళ్లిన రాజు అబ్బా ఎంత బాగా డెకరేట్ చేశారు రూమ్ అని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అప్పుడే అపర్ణ, నందు కలిసి ఇందును శోభనం రూంలోకి పంపిస్తారు. రాజు ఏమీ ఇబ్బంది పెట్టొద్దని జాగ్రత్తలు చెప్తుంది అపర్ణ. ఉదయం చూస్తారు కదా నాన్నమ్మ నీ మనవడిని పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తాను అంటుంది. దూరం నుంచి అంతా గమనిస్తున్న రేఖ, భ్రమరాంబ త్వరగా ఆ రూంలోంచి అరుపులు వినిపిస్తాయేమోనని ఎదురు చూస్తుంటారు. రూంలో ఉన్న రాజు, ఇందు వచ్చి తన కాళ్లు మొక్కి దీవించమని అడిగినట్టు, తనకు పాల గ్లాసు అందించినట్టు ఊహల్లో తేలియాడుతుంటే ఇందు రూంలోకి వెళ్లి ఏంటి రాజు డ్రీమ్స్ లో ఉన్నావా అంటూ పాలు మొత్తం తనే తాగేస్తుంది.

ఇద్దరి మధ్య డ్యూయెట్ వస్తుంది. ఇద్దరికి శోభనం అయిపోతుంది. ఉదయమే ఆత్రుతగా శోభనం రూమ్ దగ్గరకు వెళ్తాడు శేషు. రూం డోర్ దగ్గరే నిండుగా దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటారు రేఖ, భ్రమరాంబ. వాళ్లను చూసి షాక్ అవుతాడు శేషు. గట్టిగా అరిస్తే వాళ్లు ఉలిక్కిపడి లేస్తారు. భ్రమరాంబ చనిపోయారా చనిపోయారా అంటూ అరుస్తుంటే రేఖ కోపంగా వదినా నువ్వు ఆగు అంటుంది. అప్పుడే రూంలోంచి బయటకు వస్తున్న ఇందు, రాజులను చూసిన భ్రమరాంబ, రేఖ షాక్ అవుతారు. వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయిందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img