
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 1142..లో...రాజు, ఇందు కలిసి సిరిని ఇంటికి తీసుకురావడంతో అపర్ణ తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇందు జీవితం నాశనం అవుతుందేమోనని భయపడుతూ కన్నీరు పెడుతుంది. ఇదే అదునుగా రేఖ, భ్రమరాంభలు అపర్ణను సిరిపైకి ఎగదోయాలని ప్లాన్ వేస్తారు. సైలెంట్ గా ఉన్న అపర్ణకు కోపం తెప్పించి, ఆమె నోటితోనే సిరి ఈ ఇంట్లో ఉండకూడదు అనిపించాలని రేఖ ప్లాన్ చేస్తుంది. మరోవైపు సుభాష్ తో అపర్ణ తన బాధ చెప్పుకోగా.. రాజుకు వాడు దుగ్గిరాల వారసుడని ఇందుకి రాజుకి పెళ్లి కాలేదని చెప్పేస్తానని అపర్ణ అంటుంది. కానీ సుభాష్ ఆమెను వారించి, ఇది ఇందు జీవితమని, ఆమె నిజం చెప్పాలనుకుంటుందని ఆవేశపడి ఇందుని బాధ పెట్టొద్దని సర్ది చెప్తాడు.
భోజనం సమయంలో రేఖ, భ్రమరం ప్లాన్ ప్రకారం రచ్చ మొదలుపెడతారు. రాజు ఒక్కడే తినడానికి రావడంతో మొదటి పెళ్లాం, మొదటి పెళ్లామంటూ కావాలనే రెచ్చగొడతారు. సిరిని తీసుకురమ్మని బలవంతం చేయడంతో ఇందు కూడా వెళ్లి తీసుకురమ్మని చెప్పగా రాజు సిరిని తీసుకువస్తాడు. అక్కడ సిరి తన చిన్నపిల్లల చేష్టలతో అందరిని షాక్ కు గురి చేస్తుంది. భ్రమరాంభ పేరు నచ్చలేదని ఆమెకు డబ్బా అని పేరు పెడుతుంది. అన్నం కలపడం రాకపోతే రాజునే తినిపించమని మొగుడా మొగుడా అని ముద్దుగా పిలుస్తుంది. ఇది చూసి రేఖ, భ్రమరం కావాలనే మొదటి పెళ్లం మీద ఎంత ప్రేమో అంటూ అపర్ణను మరింత రెచ్చగొడతారు. ఆ మాటలు భరించలేక అపర్ణ తినకుండానే కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తినకుండా వెళ్లిన అపర్ణ కోసం సిరి స్వయంగా భోజనం ప్లేటు తీసుకుని వెళ్లడంతో సీన్ మొత్తం మారిపోతుంది. కోపంగా ఉన్నావా, ఆకలి వేస్తుంది కదా అంటూ అమాయకంగా అపర్ణకు సిరి ముద్దలు కలిపి తినిపిస్తుంది. తినకపోతే కడుపు నొప్పి వస్తుంది.. ఆపై ఏడుపు వస్తుందని చెప్పిన సిరి మాటలకు అపర్ణ మనసు కరిగిపోతుంది. ఈ అమాయకురాలిని చూసి జాలి పడాలా, ఇందు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిందని కోప్పడాలా అర్థం కావడం లేదని అపర్ణ వాపోతుంది. మరోవైపు ఐశ్వర్య పరీక్షల కోసం కష్టపడి చదువుతుండగా భ్రమరం వచ్చి ఇందు చదువుకోకుండానే CEO అయిందని నిన్ను మాత్రమే కష్టపెడుతున్నారని అంటుంది.తరువాయి భాగంలో లాయర్ వచ్చి రాజుకి సిరితో ముందే పెళ్లి అయ్యింది కాబట్టి ఇందుతో పెళ్లి చెల్లదని, ఆస్తి మొత్తం రేఖకు పవరాఫ్ అటార్నీ ఇవ్వాలని చెప్పడంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Brahmamudi, Brahmamudi Episode 1142, Star Maa Serial, Raju, Indu, Siri, Aparna, Rekha, Bhramarambha, Subhash, Aishwarya]




.webp)

