స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-111 లో .. సంజయ్ తన వాళ్ల మీద అరిచాడని శివారాం, పార్వతి దగ్గరకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది. మీ మనవడు ఇష్టమొచ్చినట్లు తిట్టాడని చెప్పడంతో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం.. ఇప్పుడు వాడికి పెళ్లిచూపులు జరుగుతున్నాయని పార్వతి చెప్తుంది. ఇక్కడే ఉండమ్మా మాక్కూడా సాయంగా ఉంటుందని పార్వతి అనగానే జానూ సరే అంటుంది. ఆ తర్వాత రమణి, శేషు ఇద్దరు సంజయ్ దగ్గరకు పెళ్లిచూపుల విషయం చెప్పడానికి వెళ్తారు. ఇద్దరు భయపడుతుండగా శేషు మాత్రం మనసులో వీడు పెళ్లికి ఒప్పుకోడు.. అదే కదా మనకు కావాల్సింది అనుకుంటాడు.
అచ్చం పెళ్లిచూపుల లాగే రెడీ అయ్యావని రమణి అనగానే పెళ్లిచూపులు ఎవరికి అని సంజయ్ కోప్పడతాడు. నీకే అత్తయ్య వాళ్లు ఏర్పాటు చేశారు.. కిందకు రమ్మంటున్నారని శేషు చెప్తాడు. నేను రానని సంజయ్ అంటాడు. మీరు రాకండి.. మీ వాళ్ల పరువు పోయినా సరే మీరు రాకండి.. వాళ్లు పెళ్లిచూపులకి పిలిచారు ఏమనుకుంటారు.. పరువుపోతుంది వాళ్లు బాధపడతారని జాను అంటుంది. ఆ తర్వాత పెళ్లివాళ్లు వస్తారు. సంజయ్ వస్తాడో రాడో అని పార్వతి టెన్షన్ పడుతుండగా.. సంజయ్ వచ్చేస్తాడు. ఏం చెప్పి ఒప్పించావే అని పార్వతి అడగ్గా జాను మాట్లాడింది..తన మాటలకే వచ్చేశాడని రమణి చెప్తుంది. అమ్మాయికి సంజయ్ నచ్చాడని కూడా చెప్తుంది.
ఆ తర్వాత సంజయ్ అమ్మాయితో మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తాడు. చూడగానే నచ్చితే అది ప్రేమ ఎలా అవుతుంది.. కొన్ని రోజులు ట్రావెల్ చేయాలని సంజయ్ అంటాడు. వాళ్ల మాటలన్నీ జాను వింటూ ఉంటుంది. మనం ఒకరికొకరు తెలియాలంటే డేటింగ్ చేయాలని సంజయ్ అనగానే ఆ తర్వాత నచ్చకపోతే అని అమ్మాయి అడుగుతుంది. ఏముంది సింపుల్ గా విడిపోదామని సంజయ్ అనగానే అమ్మాయి కోపంగా లోపలికి వెళ్లి సంబంధం వద్దని తన పేరెంట్స్ కి చెప్తుంది. దీంతో మీరు ఇలాంటి వారు అనుకోలేదని అమ్మాయి వాళ్లు అనేసి వెళ్లిపోతారు. అసలు ఏమన్నావ్ రా అని పార్వతి అడగ్గా నా రూల్స్ చెప్పాను.మ నచ్చక వెళ్లిపోయారని సంజయ్ అంటాడు. దీంతో పార్వతి, శివరాం బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godhavari Serial Today Episode, Godhavari Episode 111, Sanjay pelli choopulu, Star Maa Godhavari serial, Janu Parvathi]




