Home

»

Tv News

Karthika Deepam2 : సూరజ్ ప్రేమ కోసం జ్యోత్స్న ఎమోషనల్.. షాక్ లో దీప, కార్తీక్!

Sep 4, 2026 10:37AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2 .ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్  769 లో.....సూరజ్ నా మెడలో తాళి కట్టనంత మాత్రాన నా ప్రేమ చచ్చిపోతుందా.. అతని ప్రేమ నాలో ఎలా అయితే మార్పు తెచ్చిందో.. నా ప్రేమ కూడా అతనిలో మార్పు తీసుకొస్తుందని దీప, కార్తీక్ లతో జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న, సూరజ్ మాలిని కొడుకు అని తెలిస్తే నా మనసు మారిపోవాలా అని దీపను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. ఇష్టపడటం లేదు ప్రేమిస్తున్నాను.. ప్రాణంగా ప్రేమిస్తున్నానంటూ కన్నీరు పెట్టుకుంటుంది జ్యోత్స్న.

 

 సూరజ్ ప్రేమ తన తండ్రి చావుకి ప్రతీకారం అని తెలిసాక కూడా ఎలా మోస్తావు.. మనల్ని వద్దనుకుని వెళ్లిపోయిన వాళ్లు మనకు వద్దని కార్తీక్ చెప్తాడు. లేదు బావా సూరజ్ మోసం చేశాడని నా మనసు మార్చుకుంటే నా ప్రేమకు అర్థం లేదు.. వాడే నన్ను మార్చాడు.. ఇది గమ్యం లేని ప్రయాణం అయినా నేను ఆపలేనని ఏడుస్తూ వెళ్లిపోతుంది జ్యోత్స్న. దీంతో దీప, కార్తీక్ లు షాక్ అవుతారు.

 

మరోవైపు దక్షిణామూర్తి, మాలినిలు జ్యోత్స్న గురించే మాట్లాడుకుంటారు. మనవరాలి పెళ్లిపీటలపై ఆపేశాం అంటే శివన్నారాయణ ఊరుకోడని దక్షిణామూర్తి అంటే, ఏ మొహం పెట్టుకుని వస్తారు.‌అన్నచావుకి కారణమైన మనిషి మనల్ని ఎలా తప్పు పడుతుందని మాలిని అంటుంది. ఇంతలో సూరజ్ రావడంతో మీ అత్త వాళ్ల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో అని మాలిని చెప్తుంది.. కానీ మళ్లీ తొలిఅడుగు వాళ్లదే అవ్వాలని మాట మారుస్తుంది.

 

మార్నింగ్ వాకింగ్ కి వెళ్లిన సూరజ్ కోసం జ్యోత్స్న కాపు కాచి నిలదీస్తుంది. నువ్వు వదిలేసింది తాళిని కాదు నా జీవితం.. నీ పగకి నాకు ఏంటి సంబంధమని ప్రశ్నిస్తుంది. దానికి సూరజ్.. మీ అమ్మ ప్రేమకి మా నాన్న చావుకి ఏంటి సంబంధం.. మీ అమ్మ ప్రేమించింది.. మీ నాన్నని పెళ్లి చేసుకుంది మీ అమ్మ కానీ చనిపోయింది మా నాన్న. నాకు నాన్న ఎవరో తెలియదు.. మీ అమ్మ చేసిన తప్పు వల్ల నాకు జీవితం లేకుండాపోయింది. మా నాన్నకి నేను ఇచ్చే నివాళి ఇదే అని ఎమోషనల్ అవుతాడు సూరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com