
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 1128 లో..రాజు దగ్గరికి తన తండ్రి వస్తాడు. వచ్చిన చలపతి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంది భ్రమరం. ఇంకోసారి అలా మాట్లాడితే బాగోదని అపర్ణ గడ్డిపెడుతుంది. నీ పాయసం నాకు వద్దులే అని భ్రమరం అంటే మొత్తం ఖాళీ చేసి వద్దని అంటున్నావ్.. అయినా పెట్టినప్పుడు తినక సైలెంట్ గా ఉండక ఇవన్నీ నీకు ఎందుకని శేషు కౌంటర్ వేస్తాడు. మేం ఇక్కడికి మా అన్నయ్య కోసం వచ్చాం.. పిలిస్తేనే వచ్చామని వెంకీ అంటాడు.
ఇంతలో ఇందు వచ్చి అంకుల్ పాయసం తిన్నారా అని అడుగుతుంది. మా గాడిద ఎక్కడ అని చలపతి అడిగితే మమ్మల్నే అంటున్నారా అని శేషు అంటాడు. ఆ తర్వాత అది అడ్డ గాడిద అని చలపతి అనడం నవ్వులు పూయించింది. నిద్రపోతున్న రాజు చెవి దగ్గరకు వచ్చి ఇంకెంతసేపు నిద్రపోతావ్ అడ్డగాడిద అంటుంది ఇందు. దీంతో రాజు ఇందును పరుగెత్తించి బెడ్ మీదకు లాగి సారీ చెప్పమని బెదిరిస్తాడు. చివరకు ఇందు.. క్షమించండి పతిదేవుడు గారు అని సారీ చెప్పడంతో ఇద్దరి మధ్య రొమాంటిక్ ఫైట్ ముగుస్తుంది.
అప్పుడే ఆటోలోంచి నందు దిగి వస్తుంది. ఎస్సై ట్రైనింగ్ అని వెళ్లావ్.. ఇప్పుడే వచ్చావ్. నిన్ను తరిమేశారా అని భ్రమరం ఓవర్ చేస్తుంది. నీకు ఉన్న కోపానికి నువ్వు ఆ ఉద్యోగానికే అన్ ఫిట్ అని భ్రమరం అనడంతో.. ఎస్సై డ్రెస్సులో నందు తనను కొడుతున్నట్లు భ్రమరం ఊహించుకుని భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






