
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 782 లో.. మీరు తీసుకొచ్చిన సూరజ్ గాడు సంతకాలు పెట్టించుకుని చావు దెబ్బకొట్టాడు.. నిండా మునిగిపోయింది మీ వల్లే అంటూ ఇంటికి రమ్మని బతిమాలిన కార్తీక్, దీపలను నానా మాటలు అంటాడు శివన్నారాయణ. కష్టకాలంలో చెడిపోయిన స్నేహితుడి ఇంటికైనా వెళ్తా కానీ కూతురి ఇంటికి, అది కూడా మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చిన మీ ఇంటికి రానని తెగేసి చెప్తాడు శివన్నారాయణ. సుమిత్ర, పారిజాతం కూడా.. దీప నీడ పడ్డ చోట గడ్డి కూడా మొలవదని ఎప్పుడో చెప్పా, నువ్వు మాకు సమాధి కట్టావంటూ దీపపై విరుచుకుపడతారు. మీరు చచ్చిపోయారని మా అమ్మతో చెప్పమంటావా తాతా.. అన్నం కూడా తినడం లేదని కార్తీక్ బతిమాలినా వినకుండా ఫ్యామిలీని తీసుకుని వెళ్లిపోతాడు శివన్నారాయణ.
ఇంట్లో నుంచి గెంటేస్తే గుడిలోకే వెళ్లాలి కదా, అలాగే శివన్నారాయణ ఫ్యామిలీ గుడి మెట్లపై కూర్చుంటుంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం.. ఆ దేవుడే దారి చూపిస్తాడని అంటాడు. కానీ పంతులు వచ్చి.. గుడి మూసేసే టైం అయింది, వెళ్లండి అనడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఆకలితో అల్లాడిపోతారు. కడుపులో మెలిపెడుతుంది, తినడానికి ఏం లేక పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందంటూ సుమిత్ర, పారిజాతం కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇదంతా చాటుగా చూసిన కార్తీక్, దీప పంతులు దగ్గరకు వెళ్లి.. గుడికి ప్రసాదం తెచ్చాం, అక్కడ ఉన్న కుటుంబానికి ఇచ్చి, గుడిలో ఉండనివ్వండి, కష్టంలో ఉన్నవాళ్లను ఆదుకోకపోతే దేవుడిపై నమ్మకం పోతుందని రిక్వెస్ట్ చేస్తారు. పంతులు కూడా..దేవుడే నీతో మాట్లాడిస్తున్నట్లు ఉందని ఒప్పుకుని క్యారేజీ తీసుకెళ్లి ఇస్తాడు.
పంతులు ఇచ్చిన భోజనాన్ని శివన్నారాయణ ఫ్యామిలీ ఆవురావురంటూ తింటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. జ్యోత్స్న కన్నీళ్లు పెట్టుకుంటుంటే పారిజాతం తినిపించి ఓదారుస్తుంది. దూరం నుంచి చూసిన దీప..ఎంతో మందికి అన్నం పెట్టిన నా కుటుంబం ఈరోజు నాలాగే అనాథ అయిపోయింది బావా అని భోరున ఏడుస్తుంది. నేనుండగా నువ్వు అనాథవు కాదు, వాళ్లూ అనాథ కాదని కార్తీక్ ధైర్యం చెప్తాడు. తెల్లారేసరికి మళ్లీ టిఫిన్లు పట్టుకొస్తారు కార్తీక్, దీప. కానీ అప్పుడే ఆలయ ధర్మకర్త వచ్చి.. ఇదేమైనా సత్రం అనుకుంటున్నారా..గుడిలో దొంగతనం చేస్తే.. ముందు స్వామి నగలు ఉన్నాయో లేదో చూడండి అంటూ శివన్నారాయణ ఫ్యామిలీని నోటికొచ్చినట్లు తిట్టి గుడిలో నుంచి బయటకు గెంటేస్తాడు. అవమానంతో శివన్నారాయణ భోరున ఏడుస్తుంటే..జ్యోత్స్నకి తల తిరుగుతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి సూరజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam 2, Karthika Deepam 2 Episode 782, Star Maa Serial, Shivannarayana, Deepa, Karthik, Suraj, Jyotsna, Sumitra, Parijatham, Temple Scene, Telugu Serial]






