Home

»

Tv News

Brahmamudi: ఒకేసారి ఇంట్లోకి రాజు, సిరి, ఇందు.. రేఖ ఏం చేయనుంది!

Sep 19, 2026 10:04AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న

సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 1140 లో.....కూతురు పెళ్లి ఇలా పీఎస్ లో చేయొద్దంటూ భ్రమరాంభ పోలీసులతో గొడవ పడుతుంటే శేషు ఆమెను సముదాయిస్తాడు. కానీ రేఖ మాత్రం.. నీ పెళ్లి కోట్లు ఖర్చు పెట్టి గ్రాంఢ్ గా చేస్తానురా అనగానే మదన్ ఎమోషనల్ అవుతాడు. నువ్వు ఇప్పటికీ మా పెళ్లిని డబ్బుతోనే కొలుస్తున్నావ్.. పెళ్లికి కావాల్సింది ఆర్భాటాలు కాదు, రెండు మనసులు కలవడం అంటూ తల్లికి గట్టిగా చెప్పి స్వాతి మెడలో మూడు ముళ్లు వేస్తాడు. తల్లిదండ్రులు వద్దని అరుస్తున్నా వినకుండా ఇద్దరూ దండలు మార్చుకుని సంతకాలు పెడతారు. ఇందు, రాజు సాక్షి సంతకాలు పెడతారు. ఎస్సై ఆశీర్వాదం తీసుకోమంటే.. వాళ్లకు మమ్మల్ని దీవించే మనసు లేదని మదన్ అనడంతో రేఖ, భ్రమరం, భూషణ్ కోపంగా వెళ్లిపోతారు. శేషు మాత్రం ఆగి అక్షింతలు వేసి దీవించి వెళ్తాడు.

 

మరోవైపు చలపతి తిట్టాడని గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది సిరి.  నాకు నా మొగుడు కావాలి, నేనిక్కడ ఉండనంటూ సిరి ఏడుస్తుంది. లక్ష్మి, వెంకీ ఎంత బ్రతిమాలినా, చాక్లెట్, చికెన్ ఆఫర్ చేసినా వినదు. దీంతో వెంకీ రాజుకి ఫోన్ చేస్తాడు. రాజు, ఇందు వెంటనే చలపతి ఇంటికి వస్తారు. మొగుడా మొగుడా అంటూ తలుపు తీసి రాజుని పట్టుకుంటుంది సిరి. చపాతీ అంకుల్ నన్ను తిట్టాడు, కొట్టడానికి వచ్చాడు..‌ నువ్వు కూడా అతన్ని తిట్టు అంటూ మారాం చేస్తుంది. చుట్టుపక్కల వాళ్లు ఏదైనా అంటారని, ఆ చిన్న పిల్లకి ఏదైనా జరిగితే ఏం చేయాలనే భయంతోనే అరిచానని చెప్తాడు. నేను ఈ ఇంట్లో ఉండను.. మొగుడుతోనే వెళ్తానని సిరి చెప్తుంది.

 

దీంతో ఇందు ఒక నిర్ణయం తీసుకుంటుంది. సిరిని ఇక్కడ ఉంచడం మంచిది కాదు..‌మా ఇంటికి తీసుకెళ్దామని అంటుంది. అక్కడికి తీసుకెళ్తే రేఖ వాళ్లు పెద్ద గొడవ చేస్తారు.. నీ మొదటి భార్యను తెచ్చావా అని రాజుని తిడతారని వారిస్తాడు. ఎవరు తిట్టినా భరిస్తాను.. నాకు నాన్న మీద ఉన్న నమ్మకంతో రాజుని పంపినట్లే ఇప్పుడు సిరిని నాకు నమ్మి పంపించండంటూ సిరి ఒప్పిస్తుంది. నేను నీకు అక్కను.. మా ఇంటికి వస్తావా.. అక్కడ బొమ్మలు ఉంటాయి.. మొగుడు కూడా ఉంటాడని చెప్పి ఇంటికి తీసుకొస్తుంది ఇందు. ఇంట్లో అప్పటికే మదన్ పెళ్లి విషయంలో రేఖ, భ్రమరం, అపర్ణ మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. ఇందు తప్పేం చేసింది..‌పరువు తీసుకొచ్చిందని సపోర్ట్ చేస్తుంది. ఇంతలో సిరితో ఇందు, రాజు ఇంట్లోకి రాగానే రేఖ చూసి.. వావ్ సూపర్, మీరు ముగ్గురూ ఇలా నడిచొస్తుంటే రెండు కళ్లు చాలట్లేదు.. నా కొడుకుని దూరం చేసి నీ మొదటి భార్యను ఇంటికి తెస్తున్నావా అని రేఖ అంటుంది.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Brahmamudi, Brahmamudi Episode 1140, Star Maa Serial, Madan, Swathi, Indu, Raju, Siri, Rekha, Bhramaramba, Shekhar, Chalapathi]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com